ఆఫ్టర్ కరోనా.. అఖండ మూవీ సక్సెస్‌తో మాంచి దూకుడు మీదున్నాడు బాలయ్య. సింహం షికారు చేస్తున్నట్టు.. పులి వేటాడినట్టు బాక్సాఫీస్ కలెక్షన్లను చీల్చి చండాడుతున్నాడు. థియేటర్లుకు జనాలను రప్పిస్తూ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పేస్తున్నారు. ఇక బోయపాటి , బాలకృష్ణ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలను మించి ఈ సినిమా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. రోజులు గడస్తున్న థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం మాస్ జనాలు మాత్రమే కాదు.. మహిళలు కూడా సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఓవర్‌సీస్ లోనూ భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది ‘అఖండ’. బాలయ్య సినిమాలపై ఆసక్తి చూపనివారు సైతం మౌత్ టాక్ చూసి మూవీ చూసేందుకు వెళ్తున్నారు.
ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు చిత్రయూనిట్ . ఈ మేరకు వైజాగ్ లో సక్సెస్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీగా జనాలు తరలి వచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :