Akhanda Collection: సరైన సినిమా పడితే బాలయ్య స్టామినా ఇది.. కలెక్షన్ల ఊచకోత.. వన్ వీక్ రిపోర్ట్

|

Dec 09, 2021 | 4:29 PM

'అఖండ'కు ముందు బాలయ్య, బోయపాటి కాంబోలో 'సింహా', 'లెజెండ్' చిత్రాలు వచ్చాయి. రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి.

Akhanda Collection: సరైన సినిమా పడితే బాలయ్య స్టామినా ఇది.. కలెక్షన్ల ఊచకోత.. వన్ వీక్ రిపోర్ట్
Akhanda Collections
Follow us on

‘అఖండ’కు ముందు బాలయ్య, బోయపాటి కాంబోలో ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు వచ్చాయి. రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. దీంతో ‘అఖండ’ కూడా విజయం సాధిస్తుందని అందరూ ఊహించారు. కానీ ఊహించిన దాని కంటే సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. ‘అఖండ’ సంచలన విజయం సాధించింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం మాస్ జనాలు మాత్రమే కాదు.. మహిళలు కూడా సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఓవర్‌సీస్ లోనూ భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది ‘అఖండ’. బాలయ్య సినిమాలపై ఆసక్తి చూపనివారు సైతం మౌత్ టాక్ చూసి మూవీ చూసేందుకు వెళ్తున్నారు. అందునా ఈ మధ్య బాలయ్య చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆయన భోళా తనం, కల్మషం లేని మనసు చూసినవారు.. తాము బాలయ్యను ఇలా అనుకోలేదని చెబుతున్నారు. ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోన్న అన్‌స్టాపబుల్ షో కూడా బాలయ్య ఎలాంటివాడో ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఈ ఇంపాక్ట్ అంతా అఖండ కలెక్షన్లపై కనిపిస్తోంది. థమన్ సంగీతం, బోయపాటి మార్క్ ఎలివేషన్స్ సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లాయి.

‘అఖండ’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చేసింది. మొదటి 6 రోజు సినిమా సింహానాదం చేసింది. వారాంతంలో కాస్త డ్రాప్ కనిపించింది. మొత్తం నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ 100 కోట్ల మార్క్ అందుకోబోతున్నారని స్పష్టమైంది.

‘అఖండ’ మూవీకి ఏడు రోజులకు కలిపి ఎంతమేర వసూలు చేసిందో ఇప్పుడు పరిశీలిద్దాం. నైజాంలో రూ. 14.87 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.73 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.56 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.08 కోట్లు, గుంటూరులో రూ. 3.73 కోట్లు, కృష్ణాలో రూ. 2.73 కోట్లు,  వెస్ట్ గోదావరిలో రూ. 2.43 కోట్లు, నెల్లూరులో రూ. 1.98 కోట్లతో.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 45.11 కోట్లు షేర్, రూ. 71.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

రెండు రాష్ట్రాల్లో దుమ్మురేపిన ‘అఖండ’.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజులకు రూ. 45.11 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక, రెస్టాఫ్ ఇండియాతో కలిపి రూ. 3.82 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.56 కోట్లు రాబట్టింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.49 కోట్లు షేర్, రూ. 87.90 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

మొత్తంగా చూస్తే అఖండ 53 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 54 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్‌తో బరిలోకి దిగిన ఈ సినిమాకి.. వరల్డ్ వైడ్‌గా 53.49 కోట్లు వసూలయ్యాయి. అంటే మరో 50 లక్షలు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్‌ క్రాస్ చేసి లాభాల బాటలోకి వెళ్ళినట్లే.  అదే విధంగా మరో రూ. 12 కోట్లు గ్రాస్ వస్తే.. గ్రాస్ పరంగా 100 కోట్ల మార్కును చేరుకుంటుంది.

Also Read: Kurnool district: మిరప చేనులో నక్కిన భారీ కొండచిలువ.. రైతు పొలానికి వెళ్లగానే

“ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు?” అడిగిన వధువు.. వరుడి ఆన్సర్ వింటే షాకే