Ajith Kumar: బైకే కాదు అజిత్ హెల్మెట్ కూడా యమా కాస్ట్లీ గురూ..! నెల జీతం పెట్టినా అది కొనలేం.!!
అజిత్ కుమార్ మాత్రం చాలా మంది స్టార్ యాక్టర్స్ కి పూర్తి భిన్నంగా ఉంటాడు. దళపతి విజయ్, రజనీకాంత్‌తో పాటు స్టార్ డమ్ ఉన్న నటుల్లో అజిత్ ఒకరు. మిగిలిన హీరోల్లా కాదు. హీరో అజిత్ తన పని తాను చేసుకుంటున్నాడు. షూటింగ్ ఉన్నప్పుడు వచ్చి నటించి, ఆ తర్వాత షూటింగ్ అయిపోగానే బైక్ రైడింగ్ కి వెళ్లిపోతారు. ఇప్పటికే అజిత్ రైడింగ్ చేసిన చాలా వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

సినిమాలతో పాటు కొంతమంది స్టార్ నటీనటులు రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం లేదా.. ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. మరికొంతమంది రియాల్టీ షోలు చేస్తూ స్టార్ డమ్, క్రేజ్ పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అజిత్ కుమార్ మాత్రం చాలా మంది స్టార్ యాక్టర్స్ కి పూర్తి భిన్నంగా ఉంటాడు. దళపతి విజయ్, రజనీకాంత్‌తో పాటు స్టార్ డమ్ ఉన్న నటుల్లో అజిత్ ఒకరు. మిగిలిన హీరోల్లా కాదు. హీరో అజిత్ తన పని తాను చేసుకుంటున్నాడు. షూటింగ్ ఉన్నప్పుడు వచ్చి నటించి, ఆ తర్వాత షూటింగ్ అయిపోగానే బైక్ రైడింగ్ కి వెళ్లిపోతారు. ఇప్పటికే అజిత్ రైడింగ్ చేసిన చాలా వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఇండియాలోని పలు రాష్ట్రాలకు బైక్ టూర్ వెళ్లిన అజిత్.. విదేశాల్లో కూడా బైక్ నడిపాడు. రీసెంట్ గా ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అజిత్ హైదరాబాద్ వీధుల్లో బైక్ నడుపుతూ ఎంజాయ్ చేశాడు. అజిత్ తన ఖరీదైన బైక్‌ను నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అజిత్ బైక్ ధరపై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి, అయితే ఇప్పుడు అతని హెల్మెట్ ధర గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. అజిత్ ఎక్కువగా బిఎమ్‌డబ్ల్యూ బైక్‌ను నడుపుతాడు. అతని దగ్గర మూడు కంటే ఎక్కువ బిఎమ్‌డబ్ల్యూ బైక్‌లు ఉన్నాయి. అజిత్ హైదరాబాద్‌లో 12 లక్షల బిఎమ్‌డబ్ల్యూ బైక్‌ను నడుపుతూ కనిపించాడు. అయితే ఈసారి మాత్రం కేవైటీ బ్రాండ్ హెల్మెట్ ధరించి కనిపించాడు. ఇది మామూలు హెల్మెట్ కాదు. ఈ హెల్మెట్ ధర 35 వేల రూపాయలు.
ఈ హెల్మెట్‌లో కార్బన్ ఫైబర్‌ని ఉపయోగిస్తారు. దాని పై భాగం చాలా గట్టిగా ఉంటుంది. అయితే ఈ హెల్మెట్ చాలా తేలికగా ఉంటుంది. ముందు గ్లాస్ పై ఎక్కువ గీతలు ఉండవు. అలాగే పొగమంచు పడినా కూడా దాని మీది అది నిలవదు. హెల్మెట్ లోపల బ్లూటూత్ స్పీకర్ , మైక్‌తో పాటు కూలింగ్ గ్లాస్ ఉంటాయి. హెల్మెట్‌లో అద్భుతమైన వెంటిలేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. అందుకే ఈ హెల్మెట్ ధర కాస్త ఎక్కువ.
ప్రస్తుతం అజిత్ ‘గుడ్, బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. గతంలో అజిత్ నటించిన ‘తునీవు’ 2023లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. సినిమాలో మిగిలిన నటీనటుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ సినిమా తర్వాత అజిత్ ‘విడ మయూర్చి’ సినిమాలో నటించనున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.