ఇన్‎‎స్టాలో డార్లింగ్ ఫాలో అవుతున్న 23 మంది స్పెషల్ పర్సన్స్‎‎‎ ఎవరు.?

02 March 2025

Prudvi Battula 

‘కల్కి 2898 ఏడీ’తో మరో 1000 కోట్లు కొల్లగొట్టి 2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేసారు రెబల్ స్టార్ ప్రభాస్.

తాజాగా వచ్చిన మంచు విష్ణు కన్నప్ప టీజర్‎లో రుద్రగా డార్లింగ్ లుక్స్‎కి గూస్‎బంప్స్ వచ్చాయి. ఇది తెగ వైరల్ అవుతుంది.

ప్రభాస్ బయట ఈవెంట్స్‌లో చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాను ఇంట్రోవర్ట్ అని ఆయనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

ఇక ప్రభాస్ సోషల్ మీడియాలోనూ అంత యాక్టివ్ కాదు.. ఎప్పుడో అమావాస్యకి, పున్నమికి ఓ పోస్ట్ పెడతాడు. అది కూడా సినిమాల అప్‌డేట్స్ మాత్రమే.

ఇక ప్రభాస్‌ను ఇన్ స్టాలో 13 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అయితే రెబల్ స్టార్ ఫాలో అయ్యేది మాత్రం కేవలం 23 మందిని మాత్రమే.

దీపికా పదుకునే, శృతిహాసన్, కృతి సనన్, పూజా హెగ్దే, శ్రద్ధా కపూర్, రిద్ధి కుమార్, ఇమాన్వి, భాగ్యశ్రీ, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వంటి వారిని ప్రభాస్ ఫాలో అవుతున్నాడు.

ఇక దర్శకులు.. సందీప్ రెడ్డి వంగా, హను రాఘవపూడి, ఓం రౌత్, సుజీత్, మారుతీ, నాగ్ అశ్విన్, రాధాకృష్ణలతో పాటు ఫిల్మ్ ఎడిటర్ డానీ బ్రకమొంటెస్‌ను ప్రభాస్ అనుసరిస్తున్నారు.

నటుల్లో అమితాబ్, కమల్ హాసన్‌, పృథ్వీరాజ్ సుకుమారన్,‎ సన్నీ సింగ్ తో పాటు... తన పెద్దనాన్న, దివంగత కృష్ణంరాజు అకౌంట్‌ను ప్రభాస్ ఫాలో అవుతున్నాడు.

తన సినిమాల అప్ డేట్స్ మాత్రమే ప్రభాస్ ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఉంటారు. రేర్‌గా సన్నిహితుల చిత్రాల అప్ డేట్స్‌ను షేర్ చేశారు.

ప్రస్తుతం రాజాసాబ్, #PrabhasHanu షూట్‎లో బిజీగా ఉన్నారు డార్లింగ్. అలాగే స్పిరిట్, సలార్ 2, కల్కి 2, హోంబలేలో 3 సినిమాలు, పృథ్వీరాజు సుకుమారన్ దర్సకత్వంలో ఓ సినిమా లైన్‎‎అప్‎లో ఉన్నాయి.