Vidaamuyarchi: మరోసారి దుమ్మురేపిన అజిత్.. అంచ‌నాలు పెంచుతోన్న విడాముయ‌ర్చి టీజర్

|

Nov 29, 2024 | 10:01 AM

అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచ‌నాల‌తో రూపొందుతోన్న ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ను కంప్లీజ్ చేసుకుంటోంది. తాజాగా ‘విడాముయ‌ర్చి’ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే సినిమాలో హీరో అజిత్ కుమార్ డిఫ‌రెంట్ అవ‌తార్‌లో కనిపిస్తున్నారు.

Vidaamuyarchi: మరోసారి దుమ్మురేపిన అజిత్.. అంచ‌నాలు పెంచుతోన్న విడాముయ‌ర్చి టీజర్
Vidaamuyarchi
Follow us on

స్టార్ హీరో అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల‌వుతుంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచ‌నాల‌తో రూపొందుతోన్న ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ను కంప్లీజ్ చేసుకుంటోంది. తాజాగా ‘విడాముయ‌ర్చి’ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే సినిమాలో హీరో అజిత్ కుమార్ డిఫ‌రెంట్ అవ‌తార్‌లో కనిపిస్తున్నారు. ప్ర‌పంచ‌మంతా నిన్ను న‌మ్మ‌క‌పోయినా ప‌రావాలేదు.. నిన్ను నువ్వు న‌మ్ముకో.. అనే కాన్సెప్ట్‌తో సినిమా యాక్ష‌న్ బేస్డ్ మూవీగా తెర‌కెక్కింది. అజిత్ దేని కోస‌మో అన్వేషిస్తున్నారు.. చివ‌ర‌కు త‌న‌కు కావాల్సిన దాని కోసం విల‌న్స్ భ‌ర‌తం ప‌డుతున్నారు. తాను సాధించాల్సిన ల‌క్ష్యం కోసం ఏం చేయ‌టానికైనా, ఎంత దూరం వెళ్ల‌టానికైనా, ఎవ‌రినైనా ఎదిరించేలా ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని ఓ వైవిధ్య‌మైన పాత్ర‌లో ఆయ‌న మెప్పించ‌బోతున్నారు అజిత్‌. టీజ‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరుకున్నాయి.

ఇది కూడా చదవండి : వీడియో లీక్ అయ్యింది.. కెరీర్ క్లోజ్ అయ్యింది.. చివరకు ఇలా..

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో స్టార్స్‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాలు, డిఫ‌రెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాల‌ను నిర్మిస్తోన్న టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ సంస్థ అధినేత సుభాస్క‌ర‌న్..‘విడాముయ‌ర్చి’ సినిమాను నిర్మిస్తుండ‌టంతో అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ్డాయి. ఆద్యంతం ఆక‌ట్టుకునే ఎంట‌ర్‌టైన్మెంట్ చిత్రాల‌తో పాటు విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడిగా పేరున్న మ‌గిళ్ తిరుమేని అజిత్‌తో ఈ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఇది కూడా చదవండి : అబ్బాయ్ సుందరం.. కంచరపాలెం చిన్నది ఇప్పుడు ఎంత అందంగా ఉందో

అజిత్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్‌, త్రిష‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ త్ర‌యం త‌మదైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడు మ‌రోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించ‌నున్నారు. అలాగే విడాముయ‌ర్చిలో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. వారి పాత్ర‌ల‌ను కూడా టీజ‌ర్‌లో రివీల్ చేశారు. అలాగే సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌కటించారు.

ఇది కూడా చదవండి: Gaami Movie : ఎంత క్యూట్‌గా ఉందో.. గామి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

కోలీవుడ్ మ్యూజిక‌ల్ రాక్ స్టార్ అనిరుద్ సంగీతాన్నిఅందిస్తుండ‌గా ఓం ప్ర‌కాష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎన్‌.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఇంకా ఈ చిత్రానికి సుంద‌ర్ స్టంట్స్‌ను కంపోజ్ చేయ‌గా, అను వ‌ర్ధ‌న్ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా ప‌ని చేశారు. సుబ్ర‌మ‌ణియ‌న్ నారాయ‌ణ‌న్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, జె.గిరినాథ‌న్‌, కె.జ‌య‌శీల‌న్ ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్‌గా వ‌ర్క్ చేశారు. ఇంకా జి.ఆనంద్ కుమార్ (స్టిల్స్‌), గోపీ ప్ర‌స‌న్న (ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌), హ‌రిహ‌ర‌సుత‌న్‌(వి.ఎఫ్‌.ఎక్స్‌), సురేష్ చంద్ర (పి.ఆర్‌.ఒ-త‌మిల్‌), నాయుడు సురేంద్ర‌ కుమార్‌ – ఫ‌ణి కందుకూరి (పి.ఆర్.ఒ – తెలుగు) సినిమాలో భాగ‌మయ్యారు. అజిత్ కుమార్ ‘విడాముయ‌ర్చి’ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..