Ajith Kumar: అజిత్ కుమార్ మంచి మనసు.. వరదల్లో చిక్కుకున్న అమీర్ ఖాన్, విష్ణు విశాల్‏కు సాయమందించిన హీరో..

|

Dec 06, 2023 | 8:12 PM

ఇటీవల షూటింగ్ నుంచి తిరిగి చెన్నై వచ్చిన అజిత్.. వరదల కారణంగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే వరదలలో చిక్కుకున్న ఇద్దరు హీరోలను స్వయంగా కలుసుకుని సహాయం చేసారు. దీంతో అతడికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు హీరో విష్ణు విశాల్. ప్రస్తుతం తుఫాన్ కారణంగా ఆంధ్రా, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రెండు రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

Ajith Kumar: అజిత్ కుమార్ మంచి మనసు.. వరదల్లో చిక్కుకున్న అమీర్ ఖాన్, విష్ణు విశాల్‏కు సాయమందించిన హీరో..
Ajith
Follow us on

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. ఇటీవలే తెగింపు సినిమాతో అలరించిన అజిత్.. ప్రస్తుతం విడతల సినిమాలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇటీవల షూటింగ్ నుంచి తిరిగి చెన్నై వచ్చిన అజిత్.. వరదల కారణంగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే వరదలలో చిక్కుకున్న ఇద్దరు హీరోలను స్వయంగా కలుసుకుని సహాయం చేసారు. దీంతో అతడికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు హీరో విష్ణు విశాల్. ప్రస్తుతం తుఫాన్ కారణంగా ఆంధ్రా, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రెండు రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

ఈ క్రమంలోనే యంగ్ హీరో విష్ణు విశాల్.. తన పరిస్థితిని వివరిస్తూ.. విద్యుత్, ఇంటర్నెట్ సర్వీస్ , ఫోన్ సిగ్నల్ లేవని.. ఇంటి వద్ద భారీగా నీళ్లు నిలిచిపోయయాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. దీంతో రెస్క్యూ టీమ్ విష్ణు విశాల్ నివాసానికి వెళ్లి అతనిని, అక్కడే ఉన్న బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్‌ను రక్షించింది. రెస్క్యూ టీమ్‌కి ధన్యవాదాలు తెలుపుతూ విష్ణు విశాల్ మరో పోస్ట్ చేశారు.

విష్ణు విశాల్, అమీర్ ఖాన్ పరిస్థితిని ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న అజిత్.. విష్ణు విశాల్ దగ్గరికి వెళ్లి వాళ్లకే కాకుండా దగ్గరివాళ్లకు కూడా ప్రయాణ ఏర్పాట్లు చేశాడు. దీన్ని అభినందిస్తూ విష్ణు విశాల్ అమీర్ ఖాన్, అజిత్‌ల ఫోటోను పోస్ట్ చేసి లవ్ యూ అజిత్ సర్ అని రాశారు. ఆపద సమయంలో ఇతరులకు సహాయం చేసినందుకు అజిత్ కుమార్ ను అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అజిత్ చేస్తున్న ఇలాంటి మంచి పనులు సమాజంలో ఎవరికీ తెలియకుండా పోతున్నాయని, విష్ణు విశాల్ షేర్ చేసిన ఈ పోస్ట్ అజిత్ గురించి మంచి విషయాలను సమాజానికి చేరవేస్తున్నాయని విష్ణు విశాల్‌కి థాంక్స్ తెలియజేస్తున్నారు అజిత్ అభిమానులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.