Guntur Kaaram: గుంటూరు కారం సినిమాలోని ఆ పేర్లపై కమ్యూనిస్టుల అభ్యంతరం.. తొలగించాలని డిమాండ్

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ముచ్చటగా వచ్చిన మూడో చిత్రం గుంటూరు కారం. తల్లీ కొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌ గా నటించింది. మీనాక్షి చౌదరి సెకెండ్‌ ఫిమేల్‌ లీడ్ రోల్‌ పోషించింది. రమ్యకృష్ణ, జయరాం, ఈశ్వరి రావు తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు

Guntur Kaaram: గుంటూరు కారం సినిమాలోని ఆ పేర్లపై కమ్యూనిస్టుల అభ్యంతరం.. తొలగించాలని డిమాండ్
Guntur Kaaram Movie

Updated on: Jan 17, 2024 | 12:48 PM

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ముచ్చటగా వచ్చిన మూడో చిత్రం గుంటూరు కారం. తల్లీ కొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌ గా నటించింది. మీనాక్షి చౌదరి సెకెండ్‌ ఫిమేల్‌ లీడ్ రోల్‌ పోషించింది. రమ్యకృష్ణ, జయరాం, ఈశ్వరి రావు తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన గుంటూరు కారంకు మొదట మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. అయితే కలెక్షన్లపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోందీ మహేశ్‌ సినిమా. ఇప్పటికే రూ. 200 కోట్లకు చేరువైన గుంటూరు కారం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు కొల్లగొట్టవచ్చని ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే గుంటూరు కారం సినిమాలో విలన్లకు మార్క్స్‌, లెనిన్‌ పేర్లు పెట్టడాన్ని ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్‌ఎఫ్‌) తప్పుపట్టింది. సినిమా నుంచి మార్క్స్‌, లెనిన్‌ల పేర్లను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు కారం సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని ఏఐఎస్‌ఎఫ్ హెచ్చరించింది.

 

ఇవి కూడా చదవండి

సినిమాలో విలన్‌లకు మార్క్స్‌, లెనిన్‌ పేర్లను వాడినందుకు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, కథానాయకుడు మహేశ్‌ బాబు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ మంగళవారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు . తక్షణమే సినిమా పేర్లను తొలగించేలా సెన్సార్ బోర్డు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. మరి దీనిపై గుంటూరు కారం చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

కలెక్షన్ల జాతర..

రమణ గాడి లిరికల్ వీడియో రిలీజ్..

గుంటూరు కారం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.