నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) సినిమాల్లో ఎలా రెచ్చిపోయిన నటిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాలయ్య టాక్ షో ఎలా నిర్వహిస్తారు..? హోస్ట్ గా బాలకృష్ణ ఏ రేంజ్‌లో అలరిస్తారో.? అనే డౌట్స్ కు చెక్ పెట్టింది ఆహాలో టెలికాస్ట్ అయిన అన్ స్టాపబుల్(Unstoppable). టాక్ షోలన్నింటిలో బాలయ్య షోనే బెస్ట్ అనేలా అన్ స్టాపబుల్‌ను నడిపించారు నటసింహం. తనదైన కామెడీ టైమింగ్ తో వచ్చిన గెస్ట్ లను తికమక పెడుతూ.. నవ్వులు పూయించారు బాలకృష్ణ. అన్ స్టాపబుల్ మొదటి సీజన్ పూర్తయిన తర్వాత సీజన్ 2 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.
మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి చేసిన బాలయ్య ఇప్పుడు సీజన్ 2 కోసం రెడీ అవుతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చారు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ఆగస్టు లోనే బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో అన్ స్టాపబుల్ కూడా ఆలస్యం అయ్యింది. ఇప్పుడు షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో అన్ స్టాపబుల్ సీజన్ 2 కు సిద్ధం అవుతున్నారు బాలయ్య. అయితే సీజన్ 2 లో మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తారని టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ లేనప్పటికీ.. మెగాస్టార్ వస్తే షో నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందని అంటున్నారు. మెగా, నందమూరి ఫ్యాన్స్. చూడాలి మరి ఏంజరుగుతుందో.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..