Naga Chaitanya- Sobhita: చైతన్య- శోభిత వైవాహిక బంధంపై మరో జ్యోతిష్యుడి సంచలన జోస్యం.. వేణు స్వామిని మించి..

|

Aug 20, 2024 | 12:07 PM

గతంలో నాగ చైతన్య- సమంతల పెళ్లి బంధం గురించి ఎలాంటి కామెంట్స్ చేశారో నాగ చైతన్య- శోభితలపై కూడా అలాంటి కామెంట్సే చేశారు వేణు స్వామి. దీంతో అక్కినేని అభిమానులు స్వామీజీపై ఫైర్ అవుతున్నారు. మరోవైపు జర్నలిస్టు సంఘాలు, మహిళా కమిషన్‌ కూడా వేణు స్వామిపై మండిపడ్డాయి. ప్రస్తుతం ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కాంట్రవర్సీ ఇంకా కొనసాగుతుండగానే మరో ప్రముఖ జ్యోతిష్యుడు చైతన్య, శోభిత మూడు ముళ్ల బంధంపై జోస్యం చెప్పారు.

Naga Chaitanya- Sobhita:  చైతన్య- శోభిత వైవాహిక బంధంపై మరో జ్యోతిష్యుడి సంచలన జోస్యం.. వేణు స్వామిని మించి..
Naga Chaitanya, Sobhita Dhulipala
Follow us on

నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం తర్వాత ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి హాట్ టాపిక్ గా మారారు. ఎంగేజ్ మెంట్ జరిగిన మరుసటి రోజే వీరి వైవాహిక జీవితంపై జోస్యం చెప్పి సంచలనం సృష్టించారాయన. గతంలో నాగ చైతన్య- సమంతల పెళ్లి బంధం గురించి ఎలాంటి కామెంట్స్ చేశారో నాగ చైతన్య- శోభితలపై కూడా అలాంటి కామెంట్సే చేశారు వేణు స్వామి. దీంతో అక్కినేని అభిమానులు స్వామీజీపై ఫైర్ అవుతున్నారు. మరోవైపు జర్నలిస్టు సంఘాలు, మహిళా కమిషన్‌ కూడా వేణు స్వామిపై మండిపడ్డాయి. ప్రస్తుతం ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కాంట్రవర్సీ ఇంకా కొనసాగుతుండగానే మరో ప్రముఖ జ్యోతిష్యుడు చైతన్య, శోభిత మూడు ముళ్ల బంధంపై జోస్యం చెప్పారు. ఉత్తరాదిన ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్న పండిట్ జగన్నాథ్ గురూజీ వీరిద్దరి దాంపత్య జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

పండిట్ జగన్నాథ్ గురూజీ చెప్పిన జాతకం ప్రకారం.. నాగ చైతన్య, శోభితల పెళ్లి 2025 సంవత్సరం మొదటి భాగంలో జరిగితే.. వారి వైవాహిక జీవితానికి ఎలాంటి ఢోకా ఉండదట. ఎలాంటి కలహాలు, ఇబ్బందులు లేకుండా వీరి సంసారం సజావుగా సాగుతుందట. నాగ చైతన్య, శోభితల నిశ్చితార్థం ఆగస్టు 8వ తేదీ సరిగ్గా ఉదయం 9.42 గంటలకు జరిగింది. న్యూమరాలజీ ప్రకారం 8 అంటే అపరిమితమని దీని ప్రకారం చైతన్య, శోభితల జీవితంలో అపరిమితంగా ఆనందం, అనుబంధాలు, భావోద్వేగాలు కొనసాగుతాయని గురూజీ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

నాగ చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ ఫొటోలు..

 

ఇక శోభిత జాతకం ప్రకారం.. నాగచైతన్యతో పాటు అక్కినేని కుటుంబంతో కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటుందట. ఇంట్లో అందరినీ కలుపుకొని వెళ్లేలా ఉంటుందట. దీని వల్ల నాగ చైతన్య కూడా ప్రశాంతమైన జీవితం గడుపుతాడట. శోభిత ప్రవర్తన, తీరు కారణంగానే నాగ చైతన్య దాంపత్య జీవితం సవ్యంగా సాగుతుందట. ఒకరి సుఖ సంతోషాలను ఒకరు పంచుకోవడంతో వారిద్దరూ తమ కాపురాన్ని ఆస్వాదిస్తారని పండిట్ జగన్నాథ్ గురూజీ తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. వేణు స్వామి చెప్పిన విషయాలకు భిన్నంగా జగన్నాథ్ గురూజీ జోస్యం ఉండడంతో అక్కినేని హ్యఫీగా ఫీలవుతున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.