Tollywoood: మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా.. వైరస్ బారిన పడ్డ మరో ప్రముఖ హీరోయిన్.. టెన్షన్‌లో సినిమా ఇండస్ట్రీ

కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. చాప కింద నీరులా ఈ వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. తాజా లెక్కల ప్రకారం ఇప్పటికే దేశంలో 250కు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదవుతుండడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.

Tollywoood: మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా.. వైరస్ బారిన పడ్డ మరో ప్రముఖ హీరోయిన్.. టెన్షన్‌లో సినిమా ఇండస్ట్రీ
Bollywoood Actress

Updated on: May 23, 2025 | 1:30 PM

కరోనా మహమ్మారి మరోసారి బుసలు కొడుతోంది. ఈ మహమ్మారి వైరస్ మెల్లిగా దేశంలో విస్తరిస్తోంది. తాజా లెక్క ప్రకారం దేశంలో 250 కి పైగా కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒకరు చనిపోయారు కూడా. ముంబయి, చెన్నై, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక మహిళలకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అలెర్ట్ అయ్యారు. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖ నటి, బిగ్ బాస్ 18 కంటెస్టెంట్, మహేష్ బాబు సతీమణ నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్‌ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తాజాగా మరో ప్రముఖ హీరోయిన్ కరోనా బారిన పడింది.

కబీర్ సింగ్, ది జ్యువెల్ థీఫ్ సినిమాలతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నికితా దత్తాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. నటితో పాటు, ఆమె తల్లి కూడా వైరస్ బారిన పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది నికితా దత్తా. ‘ఆహ్వానం లేని అతిథి (కరోనా వైరస్ మా ఇంటి తలుపు తట్టింది. స్వల్ప లక్షణాలతో, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటున్నాం. ఇది తొందరగా తగ్గిపోతుందని ఆశిస్తున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండాలి’ అని కోరింది దత్తా. కాగా ఈ హీరోయిన్ గతంలో కూడా కొవిడ్‌ బారిన పడి కోలుకుంది. కరోనా వ్యాక్సిన్‌ కూడా తీసుకుంది.

ఇవి కూడా చదవండి

నికితా దత్తా లేటెస్ట్ ఫొటోస్..

జ్యూయెల్ థీప్ ప్రమోషన్లలో నికితా దత్తా.. వీడియో

అంతకు ముందు మహేష్ బాబు సతీమణి  నమ్రతా శిరోద్కర్  సోదరి బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్  కూడా కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఆమె కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ.. అందరూ మాస్కులు వాడాలని సూచిం,చింది.  నమ్రతా ఆ పోస్టుకి గెట్ వెల్ సూన్ అని రిప్లై ఇచ్చింది.

శిల్పా శిరోద్కర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.