
సిల్వర్ స్క్రీన్ మీద కొన్ని పాత్రలకు సింహాసనం వేసే నటులు కొందరుంటారు. అలా మన్యం దొర అల్లూరి పాత్రకు వెండి తెరమీద బంగారు సింహాసనం వేసిన నటుడు కృష్ణ. ఇలాంటి చారిత్రకాలకే కాదు, మరెన్నో పౌరాణికాల్లోనూ ప్రతిభ చూపించిన నటుడాయన. ఆయన సమయానికి విలువిస్తారు. అందుకే ఎదిగారు అన్నది కొందరి మాట.
ఆయన రోజుకు 18 గంటలు పనిచేస్తారు. అందుకే అందరివాడయ్యారు అన్నది మరికొందరు అనేమాట. సినిమా పరిశ్రమ పచ్చగా ఉండాలంటే నిర్మాతలు పదిలంగా ఉండాలనుకున్నారు అదే ఆయన్ని దేవుడిలాంటి మనిషిని చేసింది… అనేది నిత్యం అందరి నోటా వినిపించే మాట. తేనెలాంటి మనసున్న బుర్రిపాలెం బుల్లోడు జీవితం గురించి పదే పదే వినిపించే ఇలాంటి మాటలు ఎన్నో… ఎన్నెన్నో…
ఇక సూపర్ స్టార్ కృష్ణ అంటే మహేష్ బాబుకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. నాన్న అంటే నాకు దేవుడు.. ఆయనే నాకు అన్ని అని చాలా సందర్భంలో మహేష్ బాబు. ఇప్పుడు ఆ దేవుడిని కోల్పోయిన శోకసంద్రంలో మునిగిపోయారు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో కన్ను మూశారు. సూపర్ స్టార్ కృష్ణ తెల్లవారుజామున 4 గంటలకు కాంటినెంటల్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కృష్ణ మరణంతో విషాదంలో మునిగిపోయింది టాలీవుడ్. నిన్న కార్డియాక్ అరెస్ట్‌తో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు కృష్ణ. ఆస్పత్రిలో చేరే సమయానికే అపస్మారక స్థితిలో ఉన్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌గా చెప్పిన వైద్యులు.. కండీషన్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. 48 గంటలు గడిస్తేనే ఏ సంగతి చెప్పగలమని ముందుగా వెల్లడించిన వైద్యులు.. ఇవాళ తెల్లవారుజామున కృష్ణ కన్నుమూసినట్టు చెప్పారు.
ఇప్పటికే మహేష్ అన్నాను, తల్లిని కోల్పోయిన మహేష్ ఇప్పుడు తండ్రిని పోగొట్టుకొని మరింత కృంగిపోయారు. ఈ ఏడాది జనవరి 9న మహేష్ అన్న కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆసమయంలో మహేష్ కరొనతో బాధపడుతున్నారు. అన్నాను కడసారి చూడలేక పోయారు మహేష్. ఇక సెప్టెంబర్ 28న మహేష్ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఇక ఇప్పుడు కృష్ణ మరణం మహేష్ బాబును మరింత విషాదం లోకి నెట్టింది. రమేష్ బాబు చనిపోయిన సమయంలో మహేష్ స్టేజ్ పైన ఎమోషనల్ గా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో మహేష్ మాట్లాడుతూ.. నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమయ్యారు. ఏది జరిగిన మీ అభిమానం మాత్రం మారలేదు అంటూ మహేష్ ఎమోషనల్ గా మాట్లాడారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..