కన్నడ చిత్రపరిశ్రమలో రేణుకాస్వామి హత్య కేసు సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా హీరో దర్శన్‍ను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దర్శన్‌తోపాటు మరో పది మందిని పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దర్శన్ ప్రియురాలు కన్నడ హీరోయిన్ పవిత్ర గౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్రదుర్గలోని అపోలో ఫార్మసీ బ్రాంచ్‌లో పనిచేసే రేణుకాస్వామి అనే వ్యక్తి బెంగుళూరులోని సుమనహళి వంతెన వద్ద శవమై కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుకస్వామి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపాడని.. ఈ విషయాన్ని పవిత్ర దర్శన్ దృష్టికి తీసుకెళ్లగా తన అనుచరులతో కలిసి రేణుకస్వామిని కిడ్నాప్ చేయించి హత్య చేశాడు.
హత్య అనంతరం రేణుకస్వామి మృతదేహాన్ని బెంగుళూరులోని కామాక్షి పాళ్యం వద్ద కాల్వలో పడేశారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా.. విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. రేణుకాస్వామిని దర్శన్ హత్య చేయించడాని తేలడంతో ఈరోజు ఉదయం జిమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో దర్శన్‍ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడను అరెస్ట్ చేశారు పోలీసులు.
రేణుకస్వామి హత్యకు కుట్ర పన్నారనే అనుమానంతో పవిత్ర గౌడను అదుపులోకి తీసుకున్నారు బెంగుళూరు పోలీసులు. ఆమెతోపాటు మరికొందరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దర్శన్ తోపాటు పవిత్ర గౌడను మైసూరు నుంచి బెంగుళూరుకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. దర్శన్ చెప్పినందుకే తాము ఈ నేరానికి పాల్పడ్డామని నిందితులలో ముగ్గురు చెప్పినట్లు సమాచారం.
#WATCH | Bengaluru Police Commissioner B. Dayananda says “In connection with a murder case registered in Kamakshipalya Police Station limits of Bengaluru West division on 9th June, one of the actors of Kannada film industry has been secured and he is being questioned. The details… https://t.co/Ze0N8FUNjf pic.twitter.com/s5DVosId9T
— ANI (@ANI) June 11, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.