‘హా..హా..హాసినీ’, ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అంటూ ‘బొమ్మరిల్లు’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకుంది జెనీలియా. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు 2012లో బాలీవుడ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు అమ్మగా మారి పిల్లల పెంపకంలో బిజీగా మారిపోయింది. దీంతో సిల్వర్ స్ర్కీన్‌కు దూరంగా ఉండిపోయింది. 2012లో తెలుగులో విడుదలైన ‘నా ఇష్టం’ ఆమె చివరి చిత్రం. ఆ తర్వాత అడపాదడపా కొన్ని చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించినా పూర్తి స్థాయి క్యారెక్టర్లు చేయలేదు. ఈ నేపథ్యంలో సుమారు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకునేందుకు సిద్ధమైందీ ముద్దుగుమ్మ. అది కూడా తన భర్త రితేశ్ తొలిసారిగా మెగాఫోన్ పట్టనున్న సినిమాతో..
బాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రితేశ్ త్వరలోనే ‘వేద్’ పేరుతో ఓ మరాఠీ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ సందర్భంగా ‘కెమెరా ముందు 20ఏళ్లు నటించాను. తొలిసారి కెమెరా వెనుక కూడా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. మెగాఫోన్‌ను చేపట్టబోతున్నాను. మరాఠీ మూవీకి దర్శకత్వం వహించనున్నాను. మీ అందరి ఆశీస్సులు కావాలి ‘ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా పోస్టర్‌ను పంచుకున్నాడు. కాగా ఇదే సినిమాతో సిల్వర్ స్ర్కీన్‌పైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది జెనీలియా. ‘మీ అందరి దీవెనలతో వివిధ భాషల్లో నటించాను. మీ ప్రేమ, గౌరవాన్ని పొందాను. మహారాష్ర్టలో పుట్టి పెరిగిన నేను.. ఇప్పటి వరకు మరాఠీ చిత్రాల్లో నటించలేకపోయాను. అయితే ‘వేద్’తో ఆ లోటు కూడా తీరిపోనుంది. పదేళ్ల విరామం తరువాత నేను సినిమాల్లో నటిస్తున్నాను. నా భర్త, నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఈ చిత్రంతో మొదటిసారి మెగాఫోన్ పట్టుకోనున్నారు. నా ఈ ప్రయాణంలో మీ అందరి దీవెనలు తోడుండాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొంది జెన్నీ. కాగా ఈ సినిమా 2022 ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
RRR Movie Trailer: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ పై సెలబ్రెటీల రియాక్షన్స్.. మాటలు రావడంలేదు అంటూ..