
ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించారు నటి యమున. తన అందం , అభినయంతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు యమున. మౌన పోరాటం మూవీ తర్వాత ఈమె స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. అందం, అభినయంతో తన మార్క్ చూపించింది. ఫ్యామిలీ హీరోయిన్ అనే ట్యాగ్ సంపాదించుకుంది. ఆతర్వాత ఊహించని సంఘటన వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తిరిగి కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు యమున. ప్రస్తుతం వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న యమున.. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తన అందానికి రహస్యం కూడా చెప్పారు యమున.
నటి యమున తన 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా అందంగా చాలా ఫిట్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పటి నుండి తనలో ఎటువంటి మార్పూ లేదని, దీనికి కారణం తన ఆరోగ్యకరమైన జీవనశైలి అని ఆమె అన్నారు. క్రమం తప్పకుండా పాటించే దినచర్య అలాగే జీవనశైలి తాను అందంగా ఉండటానికి సాయం చేస్తున్నాయని తెలిపింది. ప్రతి రోజు అంతా బాగుండాలని, సంతోషంగా ఉండాలని పాజిటివ్ థింకింగ్ తో లేస్తాను. ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల నీరు త్రాగి, ప్రెష్ అయిన తర్వాత 20 నుండి 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తాను అని తెలిపింది. అనంతరం, ఆమె ఒక గంట పాటు ధ్యానం చేయడం తప్పనిసరిగా పాటిస్తాను అని తెలిపారు.
ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. రోజును ప్రశాంతంగా ప్రారంభించడానికి ధ్యానం కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆహారం విషయంలో, గత ఆరు నెలలుగా యమున ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తాను అని తెలిపారు. ఉదయం 10 గంటలకు తన మొదటి భోజనాన్ని తీసుకుంటారు. ఇదివరకైతే బ్రౌన్ రైస్, ఇడ్లీ, దోసె వంటివి తీసుకునేవారట. మధ్యాహ్నం పూట ఫ్రూట్స్, నట్స్, మజ్జిగ, కాఫీ వంటివి తీసుకుంటారు. రాత్రి భోజనాన్ని సాయంత్రం 6:00 నుండి 6:30 గంటల మధ్య పూర్తి చేస్తారు. ఒక ముద్ద మన ప్లేట్‌లోకి రావడానికి రైతులు పడే కష్టాన్ని గుర్తుచేసుకుంటూ, అన్నం పట్ల కృతజ్ఞతతో తినడం వల్ల సాధారణ ఆహారం కూడా శరీరానికి పోషకంగా మారుతుందని ఆమె అన్నారు. పూర్వం కింద కూర్చుని భోజనం చేయడం, కాళ్లు మడిచి తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, ఆరోగ్యంగా ఉంటామని ఆమె గుర్తు చేశారు. షూటింగ్‌లలో తప్ప, ఇంట్లో మాత్రం తాను కిందే కూర్చుని భోజనం చేస్తానని వెల్లడించారు. తన పిల్లలు కూడా ఈ అలవాట్లను పాటిస్తున్నారని, కోవిడ్ సమయంలో కుటుంబమంతా కింద కూర్చుని తినడం అలవాటు చేసుకున్నారని యమున చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.