అప్పుడు, ఇప్పుడు అదే అందం.. అసలు రహస్యం ఏంటో చెప్పిన నటి యమున
ఒకప్పుడు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి యమున. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరం అయ్యారు. ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు యమున. ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

నటి యమున గుర్తున్నారా.? ఒకప్పుడు తన అందంతో, నటనతో విశేషంగా ఆకట్టుకున్నారు. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఈ వయసులోనూ యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించడానికి గల కారణాలను గతంలో ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తల్లి ద్వారా సంక్రమించిన మంచి జన్యువులతో పాటు, ఒక క్రమబద్ధమైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వల్లే ఇది సాధ్యమైందని ఆమె వివరించారు. యమున దినచర్య ఉదయం సానుకూల అఫర్మేషన్స్‌తో ప్రారంభమవుతుంది. ఈ రోజు అంతా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అనే ఆలోచనతో నిద్రలేచి, రెండు గ్లాసుల నీరు త్రాగుతా.. ఆ తర్వాత సుమారు 20-30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తా. అనంతరం, ఆమె ఒక గంట పాటు ధ్యానం చేయడం తప్పనిసరి. ధ్యానం పూర్తయిన తర్వాత, ఉదయం 10 గంటలకు తన మొదటి భోజనాన్ని తీసుకుంటా అని తెలిపారు.
ఇది కూడా చదవండి : Folk Song: ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు ఆ పాట వచ్చింది.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్
గత కొన్ని నెలలుగా ఆమె ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ను పాటిస్తున్నా. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట పండ్లు, నట్స్, మజ్జిగ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటా.. కాఫీ అంటే తనకు చాలా ఇష్టమని, అది కూడా తన దినచర్యలో భాగమని చెప్పారు. సాయంత్రం 6:00-6:30 గంటల మధ్య రాత్రి భోజనం పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి కేవలం ఆహారం, వ్యాయామం మాత్రమే కాకుండా, మానసిక ప్రశాంతత కూడా చాలా ముఖ్యమని యమున తెలిపారు. మానసు ఎంత ప్యూర్ గా ఉంటే, మీ హెల్త్ అంత బావుంటుంది అని ఆమె అన్నారు. ఒత్తిడి లేని జీవితం, ప్రశాంతమైన నిద్ర ఆరోగ్యాన్ని కాపాడతాయని తెలిపారు. భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్‌లను దూరంగా ఉంచి, తింటున్న ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ, దానికి కృతజ్ఞతా భావంతో తినాలని ఆమె సూచించారు. ఒక రైతు కష్టాన్ని స్మరించుకుంటూ, భోజనాన్ని గౌరవించాలని తెలిపారు. ఇలా మనసు పెట్టి తింటే, మామూలు ఆహారం కూడా శరీరానికి పోషకాలుగా మారుతుందని, శరీరం వాటిని పూర్తిగా గ్రహిస్తుందని ఆమె వివరించారు.
ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
చిన్నతనం నుంచీ తన తల్లి భోజనం చేసేటప్పుడు కింద కూర్చుని తినాలని చెప్పేవారని, షూటింగ్స్‌లో సాధ్యం కాకపోయినా ఇంట్లో మాత్రం కిందే కూర్చుని భోజనం చేస్తామని యమున తెలిపారు. కింద కూర్చుని, కాళ్ళు మడుచుకుని తినడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి, ఆహారం చక్కగా జీర్ణమవుతుందని, అవసరమైనంత మాత్రమే తినగలుగుతామని ఆమె పేర్కొన్నారు. ఈ అలవాట్లను తన పిల్లలు కూడా పాటిస్తున్నారని, కోవిడ్ సమయంలో తమ కుటుంబం మొత్తం ఒకే ప్లేట్‌లో కింద కూర్చుని భోజనం చేసేవారమని వివరించారు. ఆమె భర్త మాత్రం డైనింగ్ టేబుల్‌ను ఇష్టపడతారని, ఆయనను మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కాలేదని తెలిపారు. మెయిన్ గ్రాటిట్యూడ్, పీస్‌ఫుల్‌గా ఉండటం, స్ట్రెస్ ఫ్రీగా ఉండటం, నిద్ర బాగా పోగలగడం అనే నాలుగు అంశాలు ప్రస్తుత తరానికి చాలా ముఖ్యమని యమున తెలిపారు. రాత్రిపూట ఫోన్‌లను వీలైనంత త్వరగా పక్కన పెట్టి, కుటుంబంతో సమయం గడపడం, వాకింగ్ చేయడం వంటివి నిద్రను మెరుగుపరుస్తాయని చెప్పారు. తన ఆరోగ్య రహస్యాలను అందరూ పాటిస్తే అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి :నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
