కాస్టింగ్ కౌచ్.. ఈ పదం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్, నటీమణులు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరో ఒకరు తమకు ఎదురైనా చేదు అనుభవాలను, లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. చాలా మంది హీరోయిన్స్ ఊహించని విధంగా తమకు ఎదురైన చేదు అనుభవం గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా తనకు ఎదురైనా చేదు అనుభవం గురించి తెలిపింది. వితికే షేరు పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్స్ కూడా నటించింది. తాజాగా వితిక షేరు తనకు ఎదురైనా చేదు అనుభవం గురించి తెలిపింది. తన తల్లి ఎదురుగానే తనను కమిట్ మెంట్ అడిగారు అని తెలిపింది వితిక.
తాజాగా వితిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో వితిక షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని తెలిపింది. వితిక తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అలాగే హీరో వరుణ్ సందేశ్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఆ మధ్య భర్త వరుణ్ సందేశ్ తో కలిసి బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొంది. ఈ గేమ్ షో వల్ల మరికొంతమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది వితిక.
వితిక కన్నడ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 15వ ఏటనే కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 2008లో వచ్చిన అంతు ఇంతు ప్రీతి బంతు సినిమాలో నటించింది. ఆతర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. తాజాగా వితిక మాట్లాడుతూ.. ఆడిషన్ కి వెళ్ళినప్పుడు తన రంగు తక్కువని రిజెక్ట్ చేసేవారని తెలిపింది. తెలుగు అమ్మయినని తెలిసి తక్కువగా చూసేవారు. నాకు 16 ఏళ్ల వయసులో ఓ ఆడిషన్ కు వెళ్ళాను, అమ్మతో కలిసి ఆ ఆడిషన్ కు వెళ్ళాను. అయితే మీ అమ్మతో మాట్లాడాలి అని చెప్పి నన్ను బయటకు పంపించారు. మీ అమ్మాయికి ఆఫర్ రావాలంటే కమిట్ మెంట్ ఇవ్వాలి అని అన్నారు. అది మా అమ్మకు అర్ధం కాలేదు. దాంతో నన్ను లోపలి రమ్మంది.. వెళ్లిన తర్వాత ఎదో కమిట్ మెంట్ అని అంటున్నారు అని చెప్పింది మా అమ్మ. కానీ అర్ధమయ్యి వారిని నో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కమిట్మెంట్ మాత్రం ఇవ్వనని తెగేసి చెప్పేశా అని వితికా తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.