Varalaxmi Sarathkumar: హైదరాబాద్ కు పూర్తిగా మకాం మార్చేసిన విలక్షణ నటి వరలక్ష్మీ.. కారణం అదేనా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫీమేల్ విలన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ అమ్మడు ఒకప్పుడు హీరోయిన్ గా తమిళ భాషల్లో సినిమాలు చేశారు

Varalaxmi Sarathkumar: హైదరాబాద్ కు పూర్తిగా మకాం మార్చేసిన విలక్షణ నటి వరలక్ష్మీ.. కారణం అదేనా..?
Varalaxmi Sarathkumar

Edited By:

Updated on: Mar 09, 2022 | 6:10 AM

Varalaxmi Sarathkumar: ప్రస్తుతం టాలీవుడ్ లో ఫీమేల్ విలన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ అమ్మడు ఒకప్పుడు హీరోయిన్ గా తమిళ భాషల్లో సినిమాలు చేశారు. సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ ప్రస్తుతం భిన్నమైన పాత్రలు చేస్తూ సత్తా చాటుతున్నారు. విలక్షణ పాత్రలకు కేరాఫ్ గా మారుతున్న వరలక్ష్మీ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అదరగొట్టారు వరలక్ష్మి. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఇక ఆతర్వాత చాలా వరకు వరలక్ష్మికి అలాంటి పాత్రలే దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే గోపీచంద్ బాలయ్య తో తెరకెక్కిస్తున్న  బాలకృష్ణ107 సినిమాలోకూడా కీలక పాత్రలో వరలక్ష్మీ కనిపించనుంది. దానితో పాటు పలు సినిమాల్లో నటిస్తుంది వరలక్ష్మీ.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు చెన్నై నుంచి మకాం హైదరాబాద్ కు మార్చేసిందని తెలుస్తుంది. పుట్టి పెరిగిన చెన్నై నగరాన్ని వీడినట్లుగా ప్రకటించింది వరలక్ష్మీ . ఇక ముందు నుండి తన పూర్తి జీవితంను హైదరాబాద్ లోనే కొనసాగిస్తాను అంటూ ప్రకటించింది. ప్రస్తుతం తెలుగులో ఈ చిన్నదానికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి . అందువల్లే ఇక్కడికి షిఫ్ట్ అయ్యిందా.. లేక వరలక్ష్మీ చెన్నై ను వీడి హైదరాబాద్ కు రావడానికి మరేదైనా కారణం ఉందా.? అన్ని ఆమె అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ లోని ఒక ఖరీదైన ఏరియాలో అపార్ట్మెంట్ లో ప్లాట్ ను తీసుకున్న వరలక్ష్మి త్వరలోనే ఒక ఇండిపెండెంట్ ఇల్లును కూడా తీసుకునే ఆలోచన చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సరసన ఆ ముద్దుగుమ్మ.. బాబీ.. చిరు సినిమాలో హీరోయిన్ ఎవరంటే..

Priyanka Jawalkar: కుర్రాళ్లను ఫిదా చేస్తున్న ముద్దుగుమ్మ.. ప్రియాంక కు ఫిదా అవుతున్న నెటిజన్లు.. (ఫొటోస్)

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..