Vanisri: సీనియర్ హీరోయిన్ కు సీఎం సాయం.. రుణపడి ఉంటానన్న నటి

|

Sep 29, 2022 | 7:22 AM

ప్రముఖ సినీనటి వాణిశ్రీకి సంబంధించిన స్థలం చెన్నై నగరంలో ఉంది .చూలమేడు ప్రాంతంలో ఉన్న ఈ స్థలం విలువ కోట్లలో ఉంటుంది.అప్పట్లో రబ్బర్ ఫ్యాక్టరీ నడిపి ఆతరువాత ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోవడం తో

Vanisri: సీనియర్ హీరోయిన్ కు సీఎం సాయం.. రుణపడి ఉంటానన్న నటి
Actress Vanisri
Follow us on

ప్రముఖ సినీనటి వాణిశ్రీకి సంబంధించిన స్థలం చెన్నై నగరంలో ఉంది. చూలమేడు ప్రాంతంలో ఉన్న ఈ స్థలం విలువ కోట్లలో ఉంటుంది.అప్పట్లో రబ్బర్ ఫ్యాక్టరీ నడిపి ఆతరువాత ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఖాళీగా ఉన్న స్థలం ఫై కొంతమంది కన్ను పడింది .ఈ క్రమంలో కొంతమంది నకిలీ పత్రాలను సృష్టించి నటి వాణిశ్రీ కి చెందిన ఇరవై కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసారు.సంవత్సరాల పాటు పోరాడిన స్థలం వివాదం మాత్రం అలాగే ఉండిపోయింది. ఇదిలా ఉండగా సీఎం స్టాలిన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నటి వాణిశ్రీ కి చెందిన ఇరవై కోట్ల విలువైన స్థలాన్ని ఆమెకు దక్కేలా చేసింది.

చెన్నై మహానగరం లో ఉన్న ఖరీదైన స్థలాలను కొంతమంది నకిలీ డాకుమెంట్స్ తో కబ్జా చేయడాన్ని అరికట్టడానికి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నగరం లో ఎక్కడెక్కడ భూములు వివాదంలో ఉన్నాయో గుర్తించి ఆ భూములకు సంబంధించిన డాకుమెంట్స్ ఒరిజినల్ లేక నకిలీవా అని గుర్తించి స్థలానికి చెందిన యజమానులకు అందించాలని అధికారులని ఆదేశించిన సీఎం స్టాలిన్. అందులో భాగంగా నటి వాణిశ్రీ ఇరవై కోట్ల విలువైన స్థలాన్నిగుర్తించి వాణిశ్రీకే చెందేలా సెక్రటేరియట్‌లో వాణిశ్రీ చేతికి స్థలం డాకుమెంట్స్ ని అందజేసిన సీఎం స్టాలిన్. తన స్థలాన్ని తనకు ఇప్పించిన సీఎం స్టాలిన్ కి ఎంతో రుణపడి ఉంటానని నటి వాణిశ్రీ ఆనందం వ్యక్తం చేసారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.