Trisha: ఎన్నికల్లో ఓటేసిన తర్వాత త్రిష షేర్ చేసిన తొలి పోస్ట్‌ ఏంటో తెలుసా? విజయ్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన తల్లితో కలిసి ఓటు హ‌క్కు వినియోగించుకుంది హీరోయిన్ త్రిష. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసిందీ అందాల తార. టీవీకే అధినేత విజయ్ కు ఇన్ డైరెక్టుగా తన సపోర్టు నిస్తున్నట్లుగా ఉన్న ఆ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Trisha: ఎన్నికల్లో ఓటేసిన తర్వాత త్రిష షేర్ చేసిన తొలి పోస్ట్‌ ఏంటో తెలుసా? విజయ్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్
Trisha

Updated on: Apr 23, 2026 | 9:51 PM

గత కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ రేపిన తమిళనాడు ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈసారి డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం(టీవీకే)’ పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయ్ పార్టీ పోటీ చేస్తోంది. ఇక విజయ్‌ కూడా తిరుచురాపల్లి ఈస్ట్‌, పెరంబూర్‌ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. కాగా గురువారం (ఏప్రిల్ 23)న జరిగిన పోలింగ్ లో భారీ ఓటింగ్ నమోదైంది. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీవీకే అధినేత హీరో విజయ్, రజనీకాంత్, అజిత్, ధనుష్, శ్రుతి హాసన్, కమల్ హాసన్, త్రిష, ఖుష్బూ, శివ కార్తికేయన్, డైరెక్టర్ అట్లీ తదితర ప్రముఖులు తమకు కేటాయించిన పోలీంగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. అయితే వీరిలో అందరి దృష్టిని ఆకర్షించింది త్రిష అని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా విజయ్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు బలం చేకూరుస్తూ ఇద్దరూ కూడా జంటగా ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. దీంతో వీరు కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఓటు వేయడానికి వచ్చిన త్రిషపై మీడియా ప్రత్యేక దృష్టి‌ పెట్టింది. అయితే త్రిష మాత్రం సింపుల్‌గా తన తల్లితో వచ్చి ఓటు వేసి వెళ్లిపోయింది.

చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన త్రిష, ఆ తర్వాత తన వేలికి ఉన్న సిరా చుక్కను మీడియాకు చూపిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాసేపటికే అదే ఫొటోని తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో షేర్‌ చేసింది త్రిష. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ ఫొటోకు ఆమె జోడించిన పాట ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఆ సాంగ్ మరేదో కాదు విజయ్‌- త్రిష జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గిల్లి’లోని ‘అర్జునర్ విల్లు’ అనే పాట. ఈ సాంగ్ ఒక్కటే కాదు.. అందులో కేవలం ‘విజిల్స్’వినిపించే భాగాన్ని మాత్రమే ఆమె తన పోస్ట్‌కి జత చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. విజయ్ టీవీకే పార్టీ గుర్తు విజిల్. ఈ క్రమంలోనే త్రిష ఆ పాట, విజిల్ తో ఫొటో షేర్ చేసిందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. విజయ్‌కు మద్దతు తెలపడానికే త్రిష ఈ పాటను వాడారని అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

త్రిష ఇన్ స్టా గ్రామ్ స్టోరీ పోస్ట్..

Actress Trisha Krishnan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us