Trisha: 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో అడుగు పెడుతున్న త్రిష.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్

చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ సరసన త్రిష. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో కూడా నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో త్రిష టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది. ఎక్కువగా ఆమె తమిళ్ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అంతే కాదు ఈ సినిమాలో నటించిన ఐశ్వర్య రాయ్‌తో అందం విషయంలో పోటీ పడింది.

Trisha: 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో అడుగు పెడుతున్న త్రిష.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్
Trisha
Follow us
Rajeev Rayala

|

Updated on: May 13, 2024 | 9:10 AM

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది త్రిష. తెలుగులో ఈ బ్యూటీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో త్రిష దాదాపు అందరు హీరోల సరసన నటించి మెప్పించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ సరసన త్రిష. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో కూడా నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో త్రిష టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది. ఎక్కువగా ఆమె తమిళ్ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అంతే కాదు ఈ సినిమాలో నటించిన ఐశ్వర్య రాయ్‌తో అందం విషయంలో పోటీ పడింది. ఇక ఇప్పుడు త్రిష బాలీవుడ్ లోకి అడుగు పెడుతుందని వార్తలు జోరుగా వినిపిస్తుంది.

ఇప్పటికే చాలా మంది సౌత్ సెలబ్రేటీలు బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అక్కడ కూడా అలరిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా రీసెంట్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. జవాన్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. అలాగే ఇప్పుడు త్రిష కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. నిజానికి త్రిష బాలీవుడ్ లో గతంలో ఓ సినిమా చేసింది. 2014లో విడుదలైన కామెడీ చిత్రం ‘కట్టా-మీటా’లో త్రిష జిల్లా కలెక్టర్‌గా నటించింది. ఆతర్వాత మరో హిందీ సినిమాలో నటించలేదు.

మళ్లీ 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకిఅడుగు పెడుతుంది. అంతే కాదు ఓ స్టార్ హీరోతో రొమాన్స్ చేయనుందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలో త్రిష నటించనుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే రష్మిక మందన్నను హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మూవీ ‘సికందర్’లో త్రిష కూడా ఉంటుందని సమాచారం. . తమిళ ఏఆర్ మురుగదాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సికంధర్’ చిత్రంలో రెండో కథానాయికగా త్రిషను ఎంపిక చేసినట్లు సమాచారం.

త్రిష హీరోయిన్‌గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 22 ఏళ్లు అవుతుంది. ఇప్పటికి కూడా త్రిష డిమాండ్ తగ్గలేదు. ప్రస్తుతం త్రిష చేతిలో ఐదు సినిమాలున్నాయి. తమిళంలో ‘విధా ముయార్చి’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. మలయాళంలో ‘రామ్’, ‘ఐడెంటిటీ’ సినిమాల్లో నటిస్తోంది. రామ్ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్నారు. అలాగే మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమాలో నటిస్తుంది త్రిష. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఇవి కాకుండా సల్మాన్ ఖాన్ తో ఇప్పుడు సినిమా చేస్తుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిబిల్ స్కోరా..? చిత్రగుప్తుడి చిట్టానా..? అసలు సిబిల్ ప్రయోజనాలే
సిబిల్ స్కోరా..? చిత్రగుప్తుడి చిట్టానా..? అసలు సిబిల్ ప్రయోజనాలే
అర్ధరాత్రి బైక్ దొంగతనానికి వచ్చారు.. కట్ చేస్తే..
అర్ధరాత్రి బైక్ దొంగతనానికి వచ్చారు.. కట్ చేస్తే..
టాయిలెట్‌ డోర్ ఓపెన్ చేయగానే ఊహించని సీన్.. కనిపించింది చూడగా
టాయిలెట్‌ డోర్ ఓపెన్ చేయగానే ఊహించని సీన్.. కనిపించింది చూడగా
పైకి చూస్తే లారీ అంతా పేపర్ బండిల్సే.. కానీ లోపల చెక్ చేయగా
పైకి చూస్తే లారీ అంతా పేపర్ బండిల్సే.. కానీ లోపల చెక్ చేయగా
ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..
ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా
ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!
ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..