Tamannaah Bhatia: ఆ సినిమా మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ ఫీల్ అవుతున్నా.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఆతర్వాత వరుసగా యంగ్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది. అదే సమయంలో స్టార్ హీరోలతోను జోడీ కట్టింది. తమన్నా నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఈ అమ్మడు మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

Tamannaah Bhatia: ఆ సినిమా మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ ఫీల్ అవుతున్నా.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Tamanna

Updated on: Aug 15, 2023 | 7:55 AM

తమన్నా.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఈ అమ్మడిది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ చిన్నది. ఆతర్వాత మెల్లగా సినిమాలు తగ్గించింది. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఆతర్వాత వరుసగా యంగ్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది. అదే సమయంలో స్టార్ హీరోలతోను జోడీ కట్టింది. తమన్నా నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఈ అమ్మడు మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అలాగే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ లతో రచ్చ చేసింది.

ఇక రీసెంట్ గా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకటి సూపర్ స్టార్ సినిమా.. మరొకటి మెగాస్టార్. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది తమన్నా. ఈ సినిమా ఆగస్టు 10న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలో తమన్నా తన అందంతో ఆకట్టుకుంది.

అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఓ బంపర్ ఆఫర్ ను మిస్ చేసుకున్నా అని బాధపడుతుంది. ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకుందట. ఆ హీరో ఎవరో కాదు ప్రభాస్.. ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఛాన్స్ ను మిస్ చేసుకున్నా అని తమన్నా తెలిపింది. ఆ సినిమా మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ బాధగా ఉందని తెలిపింది.

తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.