మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia) హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. హ్యాపీ డేస్ సినిమా వరకు పెద్దగా గుర్తింపు రాని.. ఈ భామకు ఆ తరువాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. తెలుగుతో పాటు తమిళ్.. హిందీ సినిమాల్లోనూ ఆఫర్లు అందుకుంది ఈ చిన్నది. అయితే ఇటీవల కాలంలో ఈ అమ్మడి జోరు కాస్త తగ్గింది. హీరోయిన్ గా తెలుగు లో ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గాయని టాక్ వినిపిస్తుంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. రీసెంట్ గా వరుణ్ తేజ్ నటించిన గని సినిమాలో స్పెషల్ సాంగ్‌లో చిందులేసింది మిల్కీ బ్యూటీ. తాజాగా తమన్నా పెళ్లి టాపిక్ ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది.
తమన్నా త్వరలో పెళ్లిచేసుకోబోతుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతుంది. త్వరలోనే ఈ అమ్మడు పెళ్లిపీటలు ఎక్కబోతుందట. ఇప్పటికే తమన్నా కుటుంబసభ్యులు అమ్మడికి ఓ మ్యాచ్ కూడా చూశారని అంటున్నారు. ఈ వార్తలపై తమన్నా స్పందించింది. పెళ్లి తప్పకుండ చేసుకుంటా .. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్లి చూడాలంటే మరో రెండు సంవత్సరాలు ఆగాల్సిందే అంటుంది తమన్నా.. పెళ్లి విషయంలో మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లే అంటూ కొట్టి పారేసింది. ఇక ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి సరసన సినిమా చేస్తుంది.అలాగే తమిళ్ లో ఓ సినిమా కూడా చేస్తుంది. మరో వైపు మిల్కీ బ్యూటీ వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తు ఆకట్టుకుంటూ ఉంది. ఇటీవల ఒక మ్యూజిక్ వీడియో లో కూడా కనిపించి అలరించింది.
మరిన్ని ఇక్కడ చదవండి :