Samantha: బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తోన్న సమంత.. అసలు విషయం బయటపెట్టిన తాప్సీ..

|

Jul 05, 2022 | 8:04 AM

ఆమె ప్రధాన పాత్రలో హిందీలో ఓ ఫిల్మ్ చేయబోతుందంటూ వార్తలు గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత బాలీవుడ్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ తాప్సీ.

Samantha: బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తోన్న సమంత.. అసలు విషయం బయటపెట్టిన తాప్సీ..
Samantha Taapsee
Follow us on

టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది (Samantha). తమిళ్, తెలుగు ఇండస్ట్రీలలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ చిన్నది యశోధ, ఖుషి చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది సమంత. ఆమె ప్రధాన పాత్రలో హిందీలో ఓ ఫిల్మ్ చేయబోతుందంటూ వార్తలు గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత బాలీవుడ్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ తాప్సీ.

తాప్సీ ప్రధాన పాత్రలో నటించి శభాష్ మిథూ సినిమా ప్రమోషన్లలో పాల్గోన్న తాప్సీ.. సమంత బాలీవుడ్ ఎంట్రీ గురించి స్పందించింది. సమంత ప్రధాన పాత్రలో తాను ఓ సినిమా నిర్మిస్తున్నట్లుగా తెలిపింది. అంతేకాకుండా.. కంటెంట్ ప్రాధాన్యతను బట్టి అందులో తాను కూడా కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని.. ఈ సినిమా నిర్మించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. అలాగే తాను దక్షిణాదిలోనూ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. గత రెండేళ్లలో నా పనిపై విశ్వాసం పొందాను.. ఇప్పటికీ కొన్ని తప్పు ప్రాజెక్ట్స్ ఎంపిక చేస్తున్నానని.. సంతృప్తి కలిగించే పని చేయడం లేదని .. సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.