కావాలనే తోక్కేస్తున్నారు.. నా దగ్గర అంత డబ్బు లేదు.. అసలు విషయం బయట పెట్టిన తాప్సీ

ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తాప్సి. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అయితే కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో బిజీ అయ్యింది.

కావాలనే తోక్కేస్తున్నారు.. నా  దగ్గర అంత డబ్బు లేదు.. అసలు విషయం బయట పెట్టిన తాప్సీ
Taapsee Pannu

Updated on: Jan 14, 2026 | 12:11 PM

మంచు మనోజ్ నటించిన ఝుమంది నాదం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ తాప్సీ. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తాప్సీ తన అందంతో అభినయంతో కట్టిపడేసింది. ఈ సినిమా మ్యూజికల్ గా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు తాప్సీకి మంచి క్రేజ్ వచ్చేలా చేసింది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అలరించింది తాప్సీ. స్టార్ హీరోల సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంది. ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి హిట్ కూడా అందుకుంది.. కానీ ఆతర్వాత తెలుగులో ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

ఇక హిందీలో ఈ చిన్నది తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది. అక్కడ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియేంటడ్ సినిమాలు చేసి మెప్పించింది. అంతే కాదు షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించిది ఈ ముద్దుగుమ్మ. అలాగే పలు వివాదాల్లోనూ చిక్కుకుంది. హిందీలో తాప్సీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న తాప్సీ.. తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సారి పీఆర్ టీమ్ పై తాప్సీ సంచలన కామెంట్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

తాప్సీ మాట్లాడుతూ.. నేను నా పనుల్లో బిజీగా ఉన్నాను. రెండేళ్లుగా నా జర్నీ కాస్త స్లో అయ్యింది. అది నేను కావాలని తీసుకున్న గ్యాప్ అని అన్నారు. అలాగే పీఆర్ గేమ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్ళింది. ఒకప్పుడు పీఆర్ టీమ్ అంటే మన గురించి మంచిగా ప్రచారం చేసేవాళ్లు.. కానీ ఇప్పుడు పక్కవారిని తోక్కేస్తున్నారు. పక్కవారిని కిందికి లాగడానికి లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. అంత అవసరం ఏమొచ్చింది.. డబ్బులు ఇచ్చి మరీ ఇలా చేయాలా.? అని తాప్సీ ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాలతో హిట్స్ కొడితే సరిపోదు.. బలమైన వాయిస్ కూడా ఉండాలి. నా డబ్బులను నేను నా కోసం, నా కుటుంబం కోసం మాత్రమే ఖర్చు చేస్తాను.. నన్ను పొగడడానికి సోషల్ మీడియాకు రూ. 50 వేలు ఇవ్వాలి అంత డబ్బు నాకు దగ్గర లేదు అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.