Sri Sudha: విమానంలో వెకిలి చేష్టలు.. ఆకతాయికి తగిన బుద్ధి చెద్ధి చెప్పానంటోన్న ‘అర్జున్‌ రెడ్డి’ నటి

టాలీవుడ్‌ ప్రముఖ నటి శ్రీసుధ భీమిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా విమానంలో ప్రయాణించిన ఆమెకు ఓ ఆకతాయి ఇబ్బందుకుల గురిచేశాడు. వెనక సీట్లో కూర్చొని అదే పనిగా కాళ్లను ముందుకు చాస్తూ శ్రీ సుధను టచ్‌ చేసేందుకు ట్రై చేశాడు.

Sri Sudha: విమానంలో వెకిలి చేష్టలు.. ఆకతాయికి తగిన బుద్ధి చెద్ధి చెప్పానంటోన్న అర్జున్‌ రెడ్డి నటి
Sri Sudha Bhimireddy

Updated on: Jul 26, 2023 | 12:15 PM

టాలీవుడ్‌ ప్రముఖ నటి శ్రీసుధ భీమిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా విమానంలో ప్రయాణించిన ఆమెకు ఓ ఆకతాయి ఇబ్బందుకుల గురిచేశాడు. వెనక సీట్లో కూర్చొని అదే పనిగా కాళ్లను ముందుకు చాస్తూ శ్రీ సుధను టచ్‌ చేసేందుకు ట్రై చేశాడు. దీనిపై ఆమె పలుమార్లు హెచ్చరించిన సదరు వ్యక్తి చెవికెక్కలేదు. మళ్లీ అలాంటి వెకిలి చేష్టలే చేయడంతో విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. అయినా ఆ తోటి ప్రయాణికుడి తీరు మారలేదు. దీంతో సహనం కోల్పోయిన శ్రీసుధ ఆకతాయి చెంపలు పగలగొట్టింది. ఈ విషయాన్ని శ్రీసుధనే ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా తెలిపింది. విమానంలో తోటి ప్రయాణికుడు తనను ఏ రకంగా ఇబ్బందిపెడుతున్నాడో తెలియజేసేలా ఓ ఫోటోను షేర్‌ చేసిన టాలీవుడ్‌ నటి.. ‘దీనిపై ఎలా రియాక్ట్‌ అవ్వాలి? ఫ్లైట్‌ స్టాఫ్‌కి రెండుసార్లు చెప్పి చూశాను. అయినా అతడి బుద్ధి మారలేదు. అందుకే ఒక్క కిక్‌ ఇచ్చాను. అతని బొక్కలు విరిగితే నాకు మాత్రం ఎటువంటి సంబంధం లేదు’ అని రాసుకొచ్చిందీ అర్జున్ రెడ్డి నటి. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు నటి చేసిన పనిని మెచ్చుకుంటే మరికొందరు మాత్రం అలా కొట్డడం సరికాదంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తే సరిపోయేదంటూ సూచించారు.

నెటిజన్ల కామెంట్లపై కూడా శ్రీసుధ స్పందించింది. ‘ నాకు ఆ మాత్రం తెలియదా? రెండుసార్లు చెప్పి చూశాను, కానీ ఫలితం లేదు’ అని రిప్లై ఇచ్చింది. శ్రీసుధ విషయానికొస్తే.. విజయ్‌ దేవరకొండ నటించిన అర్జున్‌ రెడ్డి సినిమాతో బాగా ఫేమస్‌ అయ్యింది. ఇందులో రౌడీబాయ్‌తో కలిసి చేసిన బోల్డ్‌ సీన్స్‌ అప్పట్లో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. అంతకుముందు బాడీ గార్డ్‌, దమ్ము చిత్రాల్లో కూడా నటించింది. అలాగే సరిలేరు నీకెవ్వరు, రూలర్‌, వలయం, వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి తదితర‌ చిత్రాల్లోనూ యాక్ట్‌ చేసింది. కాగా సినిమాలతో పాటు వివాదాలతోనూ వార్తల్లో నిలిచిందీ బ్యూటీ. ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ శ్యామ్‌ కే నాయుడు, ఆయన సోదరుడు చోటా కే నాయుడుపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. అలాగే ఒకసారి బాత్‌ టబ్‌ వీడియోను నెట్టింట షేర్‌ చేసి వైరల్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..