
సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ శ్రీ సత్య. నిన్నే పెళ్లాడుతా, అత్తారింట్లో అక్కాచెల్లెలు, త్రినయని’ వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించిందీ అందాల తార. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లోనూ నటించి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ గేమ్ షోలో ఛాన్స్ కొట్టేసింది. శ్రీ సత్య బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టి ఆకట్టుకుంది. తన అందం, ఆటతీరుతో సుమారు 103 రోజుల పాటు హౌజ్ లోని గడిపింది. బిగ్ బాస్ షో ద్వారానే తెలుగు వారందరికీ బాగా దగ్గరైందీ శ్రీ సత్య. అయితే హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆమెకు సినిమాల్లో పెద్దగా అవకాశాలేమీ రాలేదు.
అందుకే ప్రస్తుతం పలు టీవీ డ్యాన్స్ షోస్ లు చేస్తూ బిజీగా ఉంటోంది. అలాగే బిగ్ బాస్ మరో కంటెస్టెంట్ మొహబూబ్‌తో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ చేస్తుంటుంది. బీబీ జోడీ అనే షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే సీజన్ 2లోనూ పాల్గొంటుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ శ్రీముఖి గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెలిపింది. శ్రీముఖిని చూసి ప్రేక్షకులు అలవాటు పడిపోయారని, ఆమె పుల్లలు పెట్టడం లాంటివి బాగా చేస్తూ, కంటెంట్‌ను ఆటపట్టిస్తూ.. షోను ముందుకు తీసుకెళ్తుందని అంది.
అలాగే ప్రదీప్ గురించి మాట్లాడుతూ.. ప్రదీప్ మాత్రం నవ్విస్తూ, ఎవరినీ బాధ పెట్టకుండా షోను నడుపుతారని, అతనిలో గతంలో కనిపించిన ఉత్సాహం ప్రస్తుతం కాస్త తగ్గిందని తన అభిమానిగా చెప్తున్నా అని శ్రీ సత్య చెప్పుకొచ్చింది. శ్రీ సత్య చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.