తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను బుధవారంనాడు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు డ్యాన్స్ వేస్తూ సంబరాలు చేసుకున్నారు. పవన్ కల్యాణ్ కారణంగానే తనకు సంబరాల రాంబాబు అనే పేరు వచ్చిందన్నారు. అయితే పవన్ కల్యాణ్ పొలిటీషియన్ కాదు యాక్టరే అని అభిప్రాయపడ్డారు.