ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో కుటుంబసమేతంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. గ్రామస్తులతో కలిసి ముగ్గుల పోటీలు, పిల్లల ఆటలు వీక్షించారు. మనవడు దేవాన్ష్ స్థానిక చిన్నారులతో కలిసి ఉత్సాహంగా ఆటల్లో పాల్గొనగా.. చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి ఆనందంతో వీక్షించారు. విజేతలకు బహుమతులు అందజేసి వారితో ఫొటోలు దిగారు.