Shruti Haasan: ఆ వార్తలలో నిజం లేదు.. రూమర్స్‏ను ఖండించిన శ్రుతిహాసన్.. ఏమన్నదంటే..

ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆ వీడియోలో చెప్పుకొచ్చింది శ్రుతి. తాను కేవలం పీసీఓఎస్ సమస్యతో మాత్రమే బాధపడుతున్నానని.. అంతకు మించి తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపింది.

Shruti Haasan: ఆ వార్తలలో నిజం లేదు..  రూమర్స్‏ను ఖండించిన శ్రుతిహాసన్.. ఏమన్నదంటే..
Shruti Haasan

Edited By: Ravi Kiran

Updated on: Jul 06, 2022 | 6:38 PM

గత కొద్దిరోజులుగా టాలీవుడ్ అగ్రకథానాయిక శ్రుతి హాసన్ (shruti haasan) ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ఇన్ స్టాలో తాను పీసీఓఎస్ సమస్యతో ఇబ్బందిపడుతున్నట్లు వెల్లడించింది శ్రుతి. దీంతో ఆమె పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతందంటూ నెట్టింట రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా శ్రుతి హాసన్ తన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. తన ఆరోగ్య పట్ల వస్తున్న వార్తలన్ని అవాస్తవం అని.. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆ వీడియోలో చెప్పుకొచ్చింది శ్రుతి. తాను కేవలం పీసీఓఎస్ సమస్యతో మాత్రమే బాధపడుతున్నానని.. అంతకు మించి తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవంటూ చెప్పుకొచ్చింది.

“అందరికీ నమస్కారం. నేను ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నాను. అలాగే ఉత్తమ సమయాన్ని గడుపుతున్నాను. నేను కొన్ని రోజుల క్రితం నా వ్యాయమ దినచర్య, PCOS గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. PCOS సమస్య గురించి మహిళలకు తెలుసు. ఇది ఎంత కష్టమైనదో వారికి తెలుసు. అయితే నేను దీన్ని ఓ పోరాటంగా కాకుండా సహజమైన మార్పుగా స్వీకరిస్తున్నాను. అందుకు తగినట్టుగా నా శరీరానికి పనిచేప్తున్నాను. ప్రస్తుతానికి నా శరీరం ఎలా ఉన్న మనసు చాలా బాగుంది. బాగా తింటున్నా, నిద్రపోతున్నా.. వ్యాయమాన్నీ ఆస్వాదిస్తున్నాను.. నేను గతంలో చేసిన పోస్ట్ ను సరిగ్గా చదవకుండానే కొన్ని మీడియా సంస్థలు నా ఆరోగ్యం గురించి అవాస్తవాలు ప్రచురిస్తున్నాయి. నాకు ప్రతి రోజు సన్నిహితుల నుంచి కాల్స్ వస్తున్నాయి. నేను హాస్పిటల్లో ఉన్నానా ? అంటూ అడుగుతున్నారు. ప్రస్తుతం నేను బాగున్నాను. కేవలం PCOS సమస్య మాత్రమే ఉంది. నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న వారికి ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చింది శ్రుతి. ప్రస్తుతం శ్రుతి హాసన్ సలార్ సినిమా షూటింగ్ లో పాల్గోంటున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.