కొంప ముంచుతున్న బ్యూటీ ట్రీట్మెంట్లు..! నటి షఫాలీ మృతికి అసలు కారణం అదేనా?

ప్రముఖ నటి షఫాలీ జరివాలా (42) ఆకస్మిక మృతి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె గుండెపోటుతో మరణించిందన్న ప్రచారానికి భిన్నంగా యాంటీ ఏజింగ్ మందుల వల్ల మృతి చెంది ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో భాగంగా నటి ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు రెండు బాక్సుల యాంటీ ఏజింగ్‌, స్కిన్‌ గ్లో టాబ్లెట్స్‌ను గుర్తించారు. దీంతో అసలు కాస్మొటిక్ ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వాలి? ఎవరు పర్యవేక్షణ చేయాలి? అసలు మార్కెట్‌లో ఏం జరుగుతుంది.?

కొంప ముంచుతున్న బ్యూటీ ట్రీట్మెంట్లు..! నటి షఫాలీ మృతికి అసలు కారణం అదేనా?
Actress Shefali Jariwala Death

Updated on: Jul 01, 2025 | 7:35 PM

ఆధునిక ప్రపంచంలో ఆనందం పెంచుకోవడం, మందం తగ్గించుకోవడం కోసం తాపత్రయ పడుతుంటారు. ఇలాంటి వారికోసం కాస్మోటిక్ ప్రపంచం సైతం పుట్టుకొచ్చింది. యాంటి ఏజింగ్,ఫేషియల్, స్కిన్ గ్లో లాంటి చికిత్సలతో మార్కెట్ విస్తరించింది.ఇప్పుడున్న సోషల్ మీడియా లో సైతం ప్రచారం పెరగడం తో చాలా మందికి కాస్మొటిక్ ట్రీట్మెంట్ పై ఆసక్తి చూపుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న సరైన పర్యవేక్షణలేని కాస్మోటలాజిస్ట్ లు పెరగడంతో చికిత్సలో నాణ్యత తగ్గి సైడ్ ఎఫెక్ట్స్ పెరగడంతో పాటు ప్రాణాలు సైతం వదులుకునే పరిస్థితి వచ్చింది.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కాస్మొటిక్ ట్రీట్మెంట్ క్లినిక్‌లతో తస్మాత్ జాగ్రత్త.. లేదంటే ప్రాణాలకే ఎసరు పెట్టేస్తున్నారు ఈ ఆన్ ప్రొఫెషనల్ కాస్మొటాలజిస్టులు. రీసెంట్ గా చనిపోయిన కాంటాలగా ఫేమ్ షఫాలి మృతి ఈ కోవకే చెందింది. యాంటీ ఏజింగ్ కోసం ట్రీట్మెంట్లో భాగంగా ఇంజక్షన్స్ తీసుకుంటున్న షఫాలి.. ఉపవాసం ఉంటూ ఇంజక్షన్ తీసుకున్నందుకు కార్డియాక్ అరెస్ట్ అయిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందంగా తయారు కావడం కోసం జరిగే ట్రీట్మెంట్లో అనేక కెమికల్ రిలేటెడ్ పదార్థాలు వాడటం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ప్రాథమిక అనుమానం.

అయితే ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్, అందం కోసం చేసే మరే ఇతర చికిత్స లో ఉపయోగించే పదార్థాలు వల్ల ఎలాంటి ప్రాణహాని ఉండదని వైద్యులు అంటున్నారు.యాంటి ఏజింగ్ వల్లే చనిపోయింది అనడం కరెక్ట్ కాదు అని యాంటి ఏజింగ్ ప్రాసెస్ లో ఎక్కువగా యూస్ అయ్యేది గ్లూటూతయాన్.దీని వల్ల చనిపోవడం అనేది చాలా రేర్.ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ బాడీ లో తగ్గించడానికి యూస్ అవుతుంది దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అని నిపుణులు అంటున్నారు.గ్లూటతయాన్ వల్ల కార్డియాక్ అరెస్ట్ రాదు అని..వారి లైఫ్ స్టైల్,ఆహారపు అలవాట్ల కు ట్రీట్మెంట్ తొడవ్వడం తో హార్ట్ ఎటాక్ రావొచ్చు అనేది ఒక అనుమానం మాత్రమే అని గుండె సంబంధిత వైద్యులు అంటున్నారు.
బైట్..డాక్టర్ అంజనీ కార్డియల్జిస్ట్

ఇవి కూడా చదవండి

కాస్మోటిక్ ట్రీట్మెంట్ లో భాగంగా జరిగే యాంటీ ఏజింగ్ ఇంజక్షన్ లో ఉపయోగించే గ్లూటతయాన్ తో బాడీ లోని హార్మోన్ ల వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు కానీ.. ఎలాంటి ప్రాణ నష్టం ఉండదని అంటున్నారు డెర్మటాలజిస్ట్‌లు. ఈ చికిత్స వల్ల స్ట్రెస్ తగ్గి ఎనర్జీ పెరుగుతుంది. కానీ మార్కెట్ లో విచ్చల విడిగా పుట్టుకొచ్చిన అన్ ప్రొఫెషన్స్ దీన్ని స్కిన్ లైటింగ్ ఏజెంట్ లా మార్చేశారు. ఇంకా అందం పెరగడం కోసం అనేక కెమికల్ ప్రాడెక్ట్ లు వాడేస్తున్నారు. నిజానికి కాస్మొటిక్ ట్రీట్మెంట్ లోఅసిడిక్ నేచర్ ఉన్న ఫ్రూట్ ఎక్స్టర్స్ లాంటివి ఎక్కువ వాడుతారు. కాస్మొటిక్ ట్రీట్మెంట్ అనేది డెర్మటాలజీ డిపార్ట్మెంట్, ప్లాస్టిక్ సర్జరీలో ఒక పార్ట్ మాత్రమే.

ప్రస్తుతం మార్కెట్లో హల్ చల్ చేస్తున్న కాస్మోటలాజిస్ట్ లకు రెగ్యులేషన్ లేదు. పర్యవేక్షణ చేసే బోర్డు లేదు. దీనివల్ల ఎక్కడిక్కడ కొత్తగా పుట్టుకొచ్చయి. కాస్మొటిక్ ట్రీట్మెంట్ అని కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకొని వచ్చిన అన్ ప్రొఫెషన్ ట్రీట్మెంట్ వల్ల అలర్జీ వస్తె వాళ్ళు ఏం చేయలేరు. చేతులెత్తేసి సైలెంట్ అవుతారు. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని అంటున్నారు డెర్మటాలజిస్టులు. ప్రస్తుతానికి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్, వెనిరియోలజిస్ట్స్ అండ్ లెప్రాలజిస్ట్స్ (IADVL) ద్వారా పర్యవేక్షణ ఉన్నప్పటికీ అది క్షేత్ర స్థాయిలో లేకపోవడంతో ఇలాంటివి జరుగుతున్నాయని అంటున్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.