Actress Sharada: పనీపాటలేనివారే అలాంటి వార్తలు పుట్టిస్తారంటూ సీనియర్ నటి శారద ఆగ్రహం..

|

Aug 08, 2021 | 1:52 PM

Actress Sharada: జాతీయ ఉత్తమ నటి శారద మరణించారని వస్తున్న వార్తలపై శారద స్వయంగా స్పందించారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. తన మృతిపై వస్తున్న వార్తల్లో..

Actress Sharada: పనీపాటలేనివారే అలాంటి వార్తలు పుట్టిస్తారంటూ సీనియర్ నటి శారద ఆగ్రహం..
Sharada
Follow us on

Actress Sharada: జాతీయ ఉత్తమ నటి శారద మరణించారని వస్తున్న వార్తలపై శారద స్వయంగా స్పందించారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. తన మృతిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని ఓ ఆడియో రిలీజ్ చేశారు. తాను ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా చెన్నై లో ఇంటిలోనే ఉన్నానని తెలిపారు. తన పై వస్తున్న తప్పుడు వార్తలు నమ్మవద్దని.. ఇలాంటి పుకార్లు పనీపాటా లేని వారు పుట్టిస్తారని శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వార్తలు నమ్మవద్దని కోరారు.

మూడు సార్లు జాతీయ ఉత్తమనటి అవార్డు అందుకున్న శారద.. సినీ ప్రస్థానం బాలనటిగా మొదలైంది. పదేళ్ళ వయసులోనే శారద తెరపై కనిపించి అలరించారు. యన్టీఆర్, సావిత్రి నటించిన ‘కన్యాశుల్కం’లో బాలనటిగా ఓ పాటలో కనిపించారు శారద. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో నటించిన శారద ‘ఇద్దరు మిత్రులు’, ‘ఆత్మబంధువు’, ‘దాగుడుమూతలు’ వంటి చిత్రాలలో పద్మనాభం జోడీగా నటించిన శారద తెలుగులో హీరోయిన్ గా నటించడానికి చాలా సమయం పట్టింది. ఇంకా చెప్పాలంటే రచ్చ గెలిచి.. ఇంటిలో అడుగు పెట్టిన శారదా అని చెప్పవచ్చు.

శారద అంటేనే విషాద పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎందుకంటే ఊర్వశి అవార్డులు సంపాదించి పెట్టిన చిత్రాలన్నీ కన్నీరు పెట్టించేవే.. దీంతో శారద కు ఎక్కువగా అటువంటి పాత్రలే లభించాయి. ఇక శారద తో ఎన్టీఆర్ అనుబంధం ప్రత్యేకం.. బాలనటిగా నటించిన శారద కాలక్రమంలో యన్టీఆర్ తో ‘జీవితచక్రం’లో సైడ్ హీరోయిన్ గా నటించిన శారద తర్వాత కూడా ‘సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి’ చిత్రాల్లోనూ యన్టీఆర్ ద్విపాత్రాభినయంలో ఓ పాత్రకు జోడీగా నటించారు. ఎన్టీఆర్ చెల్లెలిగా రౌద్రరస పాత్రలో కనిపించారు. తర్వాత తరం హీరోలతో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి వారికీ అక్కగా, వదినగా, తల్లిగా నటించి మెప్పించారు. ప్రస్తుత జనరేషన్శా హీరోలకు అమ్మమ్మగా, నాన్నమ్మగానూ నటించి మెప్పించారు.

శారద ఫోన్ ఆడియో

SHARADA AUDIO

Also Read: Tokyo Olympics 2021: విశ్వక్రీడల్లో భారత త్రివర్ణ పతకానికి పసిడి, రజత, కాంస్య రంగులు అద్దిన క్రీడాకారులు..(photo gallery)