
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. చాలా మంది ఇక్కడ తమను తాము నిరూపించుకుంటూ రాణిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో పెళ్లి, ప్రేమలు, విడాకులు అనేవి చాలా కామన్ అయ్యాయి. ఈ మధ్య హీరో, హీరోయిన్స్ ఎఫైర్స్, పెళ్లిళ్లు, విడాకులు తెగ వినిపిస్తున్నాయి. ఇక ఎఫైర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది రెండు మూడు ఎఫైర్స్ కూడా పెట్టుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో ఓ అందాల భామ తన ఎఫైర్స్ గురించి ఓపెన్ గా చెప్పి షాక్ ఇచ్చింది. తన 20 ఏళ్ల వయసులో 43 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడ్డాను అని తెలిపింది. అంతే కాదు లైఫ్‌లో తనకు ఎంతోమంది పార్టనర్స్ ఉన్నారని.. పంచడానికి తన దగ్గర చాలా ప్రేమ ఉందని చెప్పుకొచ్చింది. ఇంతకూ ఆమె ఎవరంటే..
బాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ షహానా గోస్వామి. తాజాగా ఈ నటి తన రిలేషన్ షిప్ స్టేటస్ పై షాకింగ్ విషయాలు పంచుకుంది. చాలా మందితో డేటింగ్ చేశాను అని ఓపెన్ గా చెప్పేసింది షహానా గోస్వామి. తన 20 ఏళ్ల వయసులో 43 ఏళ్ల మిలింద్‌తో ప్రేమలో పడ్డాను అని తెలిపింది. అతను తనకన్నా 23ఏళ్లు పెద్దవాడు. ఇద్దరం ముంబైకి వచ్చాక డేటింగ్ చేశాం.. కాగా 2013లో విడిపోవాల్సి వచ్చిందని తెలిపింది. మా ఇద్దరికీ ప్రేమ ఉన్నప్పటికీ పరిస్థితుల కారణంగా విడిపోవాల్సి వచ్చింది..
ఆతర్వాత రెస్టారెంట్ వ్యాపారి మౌరో గజ్జీతో పరిచయం ఏర్పడింది.ప్రస్తుతం నాకు పార్టనర్స్ ఎవరూ లేరు. నా జీవితంలో చాలా మందితో సుదీర్ఘమైన అనుబంధాలు ఉన్నాయి. కానీ ఏదీ క్యాజువల్ కాదు” అని షహానా గోస్వామి తెలిపింది. నాకు ఫ్రెండ్స్ ఎలాగో రిలేషన్ షిప్స్ కూడా అలాగే కొంతమందితో శారీరక సంబంధం కూడా ఉండొచ్చు.. నా దగ్గర పంచడానికి చాలా పేమ ఉంది. అది ఒకరికే పరిమితం ఎందుకు చేయాలి. నా జీవితంలో దాచటానికి ఏమీ లేదు.. నేను ఇతరులతో క్లోజ్ గా ఉంటున్నాననే విషయం నా పార్ట్‌నర్స్‌కు కూడా ముందే తెలుసు అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి.