Sanjjanaa Galrani: క్యాబ్ డ్రైవర్ పై కస్సుబుస్సులాడిన హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు.. అసలేమైందంటే..

|

Oct 06, 2021 | 8:50 AM

సినీనటి సంజన గల్రాని మరోసారి వార్తల్లో నిలిచారు.. ఇటీవల డ్రగ్స్ కేసులో చిక్కుకొని బయటకు వచ్చిన సంజన ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారారు.

Sanjjanaa Galrani: క్యాబ్ డ్రైవర్ పై కస్సుబుస్సులాడిన హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు.. అసలేమైందంటే..
Sanjana
Follow us on

Sanjjanaa Galrani: సినీనటి సంజన గల్రాని మరోసారి వార్తల్లో నిలిచారు.. ఇటీవల డ్రగ్స్ కేసులో చిక్కుకొని బయటకు వచ్చిన సంజన ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.. డ్రగ్స్ కేసులో జైలు శిక్ష అనుభవించిన సంజన ఇటీవలే బెయిల్ పైన బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ క్యాబ్ డ్రైవర్‌తో గొడవపెట్టుకొని మరోసారి వార్తల్లో నిలిచారు సంజన. తాజాగా క్యాబ్ డ్రైవర్ ను నానా తిట్లు తిట్టింది సంజన. కారణం ఏంటంటే.. మంగళవారం(7 వతేదీ ) ఉదయం షూటింగ్‌ కు వెళ్లేందుకు సంజన క్యాబ్ బుచేసుకున్నారు.  బెంగళూరులోని ఇందిరానగర నుంచి రాజరాజేశ్వరినగరకు ఆమె క్యాబ్‌ బుక్‌ చేశారు. క్యాబ్‌లోకి ఎక్కిన తరువాత వెళాల్సిన ప్లేస్ మార్చాలని డ్రైవర్‌ సుసయ్‌ మణికి చెప్పారు సంజన. దాంతో ఆ క్యాబ్ డ్రైవర్ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి అడిగాడు. అయితే అతడు లొకేషన్‌ను మార్చలేదు. దీంతో ఉక్రోషంతో ఊగిపోయిన సంజన  డ్రైవర్ పై తిట్ల దండకం మొదలుపెట్టింది. నానాతిట్లు తిడుతూ అతడితో గొడవ పెట్టుకుంది. అకారణంగా సంజన తనను దూషించిందని  డ్రైవర్‌ ఆరోపించాడు. సంజన తనతో  గొడవపడటాన్ని వీడియో తీశాడు. అనంతరం  రాజరాజేశ్వరినగర పోలీసులకు అతడు ఫిర్యాదు చేశాడు.

 ఇదిలా ఉంటే సదరు క్యాబ్ డ్రైవర్ తనను చెప్పిన చోటుకు తీసుకెళ్లలేదని సంజన సోషల్ర్లో మీడియాలో ఆరోపించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కారులో ఏసీని పెంచాలని అడిగితే  డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని, కారు డోర్‌ కూడా సరిగాలేదని ఆమె ఆరోపించారు.. అలాగే అడిగినంత డబ్బులు ఇచ్చి కూడా ఇటువంటి డొక్కు  కారులో వెళ్లాలా అని సంజన రాసుకొచ్చింది. కారులో ఉండగానే ఆమె డయల్‌ 100కు ఫోన్‌ చేసి డ్రైవర్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంతో మరోసారి సంజన హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhanda: అఖండ షూటింగ్‌ను పూర్తి చేసిన నటసింహం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమా..

Pushpa : శ్రీవల్లిని పరిచయం చేయనున్న సుకుమార్.. రెండో పాటను రెడీ చేసిన పుష్ప టీమ్..

Bigg Boss 5 Telugu : ఓవరాక్షన్ చేసిన కాజల్.. లోబో చేసిన పనికి షాక్ అయిన కంటెస్టెంట్స్.. ఏం చేశాడంటే..