క్యారెక్టర్ ఆర్టిస్ట్ సన.. ఈ మీ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రల్లో నటించి మెప్పించింది సన. సన పూర్తి పేరు షానూర్ సనా బేగం. సనా దాదాపు 200 చిత్రాలలో సహాయక పాత్రల్లో నటించింది. సనకు టీనేజ్‌లో సాదత్‌తో వివాహం జరిగింది. ఆమె కుమారుడు సయ్యద్ అన్వర్ అహ్మద్ నిర్మాత. ఇక సన కోడలు సమీరా షెరీఫ్ యాంకర్. పలు షోలకు సమీరా హోస్ట్ గా చేశారు. దర్శకుడు కృష్ణ వంశీ తన 1996 చిత్రం నిన్నే పెళ్లాడతాలో సపోర్టింగ్ రోల్ తో పరిచయం అయ్యింది సన. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సనకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. 2011 చిత్రం శ్రీ రామ రాజ్యం లో కైకేయి పాత్రలో ఆమె నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సన మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. అయితే సన మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది. అయితే అలీ రెజా తో సన చేసిన రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దీని పై స్పందించింది సన.
ఆ రొమాంటిక్ సీన్ పై స్పందిస్తూ.. నేను ఆ రోల్ చేయడానికి కారణం డైరెక్టర్ కరుణ కుమార్, రైటర్ ఖాదీర్ బాబు అని తెలిపింది సన. ‘మెట్రో కథలు’ సిరీస్‌లో నేను చేసిన స్టోరీలో.. మిడిల్ క్లాస్ మహిళ ఎంత స్ట్రగుల్ అవుతుందనేది చూపించారు అని చెప్పింది సన. ప్రస్తుతం సమాజంలో జరిగే వాటినే సిరీస్‌లో చూపించారు.. ఆ పాత్రని చాలా నీట్‌గా ప్రెజెంట్ చేశారు అని చెప్పుకొచ్చారు సన. ఆ సీన్ లో చిన్న వీక్ మూమెంట్‌లో చేసిన తప్పు అది.. ఆ తప్పు నాకు నచ్చింది కాబట్టి ఒప్పుకొన్నాను అన్నారు సన.