
ఒకప్పటి ప్రముఖ నటి సనా ఖాన్ ఇటీవల తరచూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది సనాఖాన్. దీనిని చూసిన నెటిజన్లు సనాను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే పవిత్ర రంజాన్ మాసంలో బురఖా ధరించాలని సనా నటి సంభావన సేథ్ పై ఒత్తిడి తెచ్చింది. సంభవనా సేథ్ ఇటీవల సనా ఖాన్ షోలో పార్టిసిపేట్ చేసింది. ఈ క్రమంలో సనా సంభావనను బురఖా ధరించమని ఒత్తిడి చేసింది. దీని గురించి సంభావన తన బ్లాగులో చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో లో బుర్ఖా ధరించిన సనా సంభావనను కూడా బురఖా ధరించమని చెబుతోంది. ‘నీ దగ్గర మంచి డ్రెస్ లేదా? మీ బురఖా ఎక్కడ? తీసుకురండి’ అని అటుంది. అందుకు సంభావన సేత్ ససేమిరా అంటూ పక్కకు వెళ్లిపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు సనా ఖాన్‌ను లక్ష్యంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో, సనా సంభావనతో, ‘నీ దగ్గర మంచి డ్రెస్ లేదా?’ అని అడుగుతుంది. ‘సనా ఖాన్ అందరినీ మతం మార్చాలనుకుంటోంది’, ‘ఆమె ముస్లిం కాకపోయినా బుర్ఖా ధరించమని ఎందుకు బలవంతం చేస్తారు…’, ‘బహుశా మనం అలాంటి వారితో జీవించడం మానేయాలి…’, ‘ఇది చాలా అవమానకరం…’ అని కొందరు నెటిజన్లు సనాను ట్రోల్ చేస్తున్నారు.
అదే సమయంలో ‘సనా నీ పాత సినిమాల గురించి చెప్పు…’ అని గతంలో ఆమె నటించిన గ్లామరస్ సినిమాల పాత్రలను గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ఈ వీడియో చూసిన తర్వాత సనా అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. సనా, సంభవనా సేథ్ మంచి స్నేహితులని, ఇది సరదాగా జరిగిందని, దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని సనా అభిమానులు అంటున్నారు.
కాగా సనాఖాన్ తెలుగులో కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య తదితర సినిమాల్లో నటించింది. అలాగే బాలీవుడ్ మూవీస్ లోనూ యాక్ట్ చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.