Samantha: ‘ఇది టార్చర్ సమయం’.. వైరలవుతున్న సమంత ఇన్ స్టా పోస్ట్..

|

May 02, 2023 | 3:18 PM

ఓవైపు మయోసైటిస్ సమస్యతో పోరాడుతూనే మరోవైపు సిటాడెల్ చిత్రీకరణలో పాల్గొంటుంది. ఈ సిరీస్ కోసం కఠినమైన స్టంట్స్ చేస్తుంది. దీనికి ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఒరిజినల్ సిరీస్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ నటించగా... ఇండియన్ వెర్షన్ లో వరుణ్ దావన్, సమంత జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ చిత్రీకరణ ముంబైలో జరుగుతుంది.

Samantha: ఇది టార్చర్ సమయం.. వైరలవుతున్న సమంత ఇన్ స్టా పోస్ట్..
Samantha
Follow us on

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు ఉన్నాయి. ఇటీవలే శాకుంతలం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన రాబోయే సినిమాలపై ఫోకస్ పెట్టింది సామ్. ఓవైపు మయోసైటిస్ సమస్యతో పోరాడుతూనే మరోవైపు సిటాడెల్ చిత్రీకరణలో పాల్గొంటుంది. ఈ సిరీస్ కోసం కఠినమైన స్టంట్స్ చేస్తుంది. దీనికి ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఒరిజినల్ సిరీస్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ నటించగా… ఇండియన్ వెర్షన్ లో వరుణ్ దావన్, సమంత జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ చిత్రీకరణ ముంబైలో జరుగుతుంది.

అయితే ఈ సిరీస్ కోసం బాగానే కష్టపడుతుంది సమంత. ఈ షూటింగ్ లో భాగంగా రెండు చేతులకు గాయమైన ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈసిరీస్ కోసం కఠినమైన స్టంట్స్ చేస్తున్న ఫోటోలను సైతం పంచుకుంది. తాజాగా ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ఇట్స్ టార్చర్ టైమ్ అని రాసుకొచ్చారు. ఇందులో ఐస్ బాత్ టబ్ లో కూర్చున్న ఫోటోను తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ కావడంతో ఐస్ బాత్ తో ఉపశమనం పొందుతున్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

Samantha 1

ఇదే కాకుండా.. సమంత.. ఖుషి చిత్రంలోనూ నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. త్వరలోనే ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.