
సమంత.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి హీరోలతో సిరిసమానంగా ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు. నేటితో ఈ చిన్నది 37వ పడిలోకి అడుగుపెడుతోంది. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సామ్. ఆ సినిమాలో సామ్ అందానికి, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది సామ్. ఆ సినిమా నుంచే అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు అందుకుంది. ముఖ్యంగా మహేష్ బాబుతో నటించిన దూకుడు, పవన్ కళ్యాణ్ తో నటించిన అత్తారింటికి దారేది సినిమాలు ఈ అమ్మడి రేంజ్ ను పెంచేశాయి.
కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది. అక్కడ సూర్య, విజయ్, విక్రమ్ లాంటి హీరోలతో నటించింది. ఇదే క్రమంలో బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. కెరీర్ పీక్ లో ఉండగానే ప్రేమించిన నాగ చైతన్యను పెళ్ళాడి అక్కినేని కోడలు అయ్యింది. అయితే ఆ ట్యాగ్ ను ఎక్కువ రోజులు మెయింటేన్ చేయలేకపోయింది. పెళ్ళైన కొన్నేళ్ళకే చైతన్యతో విడిపోయింది సామ్.
ఆ తర్వాత సమంత కెరిర్ ఉంచించని మలుపులు తిరిగింది. తాను మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడినట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించి షాక్ ఇచ్చింది. దాంతో ఆమె అభిమానులంతా ఆందోళనకు గురయ్యారు. చికిత్స కోసం కొంత కాలం పాటు ఆమె సినిమాలకు దూరమైంది. కొంత కోలుకోవడంతో తిరిగి సినిమా షూటింగులకు హాజరవుతోంది. అదే సమయంలో తన కెరీర్ ను ఎదుర్కొన్న సవాళ్ళను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది కూడా.. అయితే ఇప్పటికి కూడా తన ఆరోగ్యం కుదుట పడలేదు. సమంత ప్రస్తుతం హైపర్ బారిక్ అనే ఆక్సిజన్ థెరపీ తీసుకుంటోంది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది సామ్. ఇక ఈ అమ్మడు పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ఆమె అభిమానులు, పలువురు సినీ తారలు కోరుకుంటూ సామ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.