Samantha: ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదం.. అభిమానులకు క్షమాపణలు చెప్పిన సామ్..
అక్కినేని సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు శాకుంతలం సినిమా చేస్తుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుంది.
అక్కినేని సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు శాకుంతలం సినిమా చేస్తుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటోందన్న సంగతి తెలిసిందే. తాజాగా సామ్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ వివాదం పై అభిమానులకు సారీ చెప్పింది. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ వలన ఎవరి మనోభావాలను దెబ్బతిసినా వారందరికి నా తరుపున క్షమాపణలు కోరుతున్నానని సామ్ అన్నారు. రాజ్ & డికే సిరీస్ నిర్మించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ద్వారా సమంత హిందీ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అయితే అందులో సామ్ తమ మనోభావాలను దెబ్బతిసిందని.. వెంటనే ఈ సిరీస్ ను బ్యాన్ చేయాలని తమిళ ప్రజలు కోరారు. సమంతకు వ్యతిరేకంగా భారీగా వ్యతిరేక ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ సిరీస్ విడుదలను నిషేదించాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత రాజీ పాత్రలో నటించింది. అయితే ఆమె పోషించిన పాత్రపై వ్యతిరేకత వ్యక్తం చేశారు తమిళులు. తాజాగా సమంత ఆ వివాదంపై స్పందించింది. వారి మనోభావాలను దెబ్బితీసినందుకు క్షమాపణలు చెప్పింది. ప్రజలు తమ సొంత అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఒకవేళ వారు ఆ అభిప్రాయంతో ఉండాలని నిర్ణయించుకుంటే ఎవరి మనోభావాలను దెబ్బతీసినా దానికి నన్ను క్షమించండి. నేను ఉద్ధేశపూర్వకంగా ఏదీ చేయలేదు. హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. నేను ఎవరినీ బాధపెట్టాలనుకొలేదు. ఒకవేళ మీకు నచ్చినవి చేసినట్లయితే నన్ను క్షమించండి అని సామ్ అన్నారు. ఇప్పటికీ నాపై కోపంగా ఉన్న వ్యక్తులను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను అని అన్నారు. ది ఫ్యామిలి మ్యాన్ 2లో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పేయి, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు.
ట్వీట్..
View this post on Instagram
Mahesh Babu: పార్టీలో కూతురితో మహేష్ డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..