AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: పార్టీలో కూతురితో మహేష్ డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నప్పటి నుంచే సితారకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు..

Mahesh Babu: పార్టీలో కూతురితో మహేష్ డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..
Mahesh Babu Sitara
Rajitha Chanti
|

Updated on: Aug 25, 2021 | 7:31 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నప్పటి నుంచే సితారకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు.. అల్లరి పనులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అలాగే గతంలో మహేష్ బాబు పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తూ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. సితారకు ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్‏లో ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలతోపాటు.. లెటేస్ట్ ఫోటోషూట్స్‏తో నెట్టింట్లో నిత్యం యాక్టివ్‏గా ఉంటుంది మహేష్ గారాల పట్టి. ఇక తన స్నేహితురాలు ఆద్యతో కలిసి గతంలో A&S అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబును ఇంటర్వ్యూ చేసింది. సితారకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచి తన తండ్రి పాటలకు స్టెప్పులెస్తూ కనిపించింది. అయితే మహేష్ , సితారా కలిసి డ్యాన్స్ చేయడం మాత్రం ఇప్పటివరకు చూడలేదు కాదా.. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు సినిమాల్లో డ్యాన్స్ చేయడం చూసుంటాం… కాని బయట డ్యాన్స్ చేయడం చూశామా…? చూడలేదు కదా..! సరే బయట కూడా డ్యాన్స్‌ చేశాడని అది మనం చూశామనే అనుకుందాం.. కాని తన కూతురు సితారతో కలిసి డ్యాన్స్ చేయడం చూశామా.. అది కూడా ఓ ప్రైవేటు పార్టీలో..! చూడలేదు కదా..

తాజాగా సోషల్ మీడియాలో మహేష్, సితార డ్యాన్స్ వీడియో వైరల్ అవుతుంది. అందులో కూతురుతో కలిసి మహేష్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. అందులో ఏదో ప్రైవేట్ పార్టీలో పిల్లలందరూ.. తమ తండ్రులతో డ్యాన్స్‌ చేస్తుంటే… సితార కూడా మహేష్ తో ‘డ్యాన్స్‌ చేద్దాం నాన్న’ అంటూ మారం చేస్తుంది. మారం చేయడమే కాదు మహేష్ చేతులు పట్టుకుని గిరగిరా తిరుగుతూ తెగ హంగామా చేసింది. అయితే నమ్రత షేర్ చేసిన ఈ వీడియో తాజాగా నెట్టింట వైలర్ అవుతూ.. ఘట్టమనేని ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు, సితార క్యూట్ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి.

వీడియో..

Also Read: Karvy MD Parthasarathy: కార్వీ స్కామ్‌లో తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న సంచలనాలు.. సీసీఎస్ కస్టడీలో ఛైర్మన్ పార్ధసారథి\

Ram Gopal Varma: కాలేజీ రోజుల్లోనే రామ్ గోపాల్ వర్మ ప్రేమాయణం.. తన ఫస్ట్ లవర్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవి..

మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు… టాలీవుడ్ సెలబ్రెటీలకు ఈడీ సమన్లు.. విచారణకు రావాలని ఆదేశాలు..