Samantha: ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత.. వీడియో

గత కొన్ని రోజులుగా వస్తోన్న రూమర్లను నిజం చేస్తూ సమంత గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం (జూన్ 24) జరిగిన ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ మీట్‌లో మాట్లాడిన సమంత తాను త్వరలో తల్లిని కాబోతున్నట్లు అధికారికంగా కన్ఫామ్ చేసింది.

Samantha: ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత.. వీడియో
Actress Samantha

Updated on: Jun 24, 2026 | 8:57 PM

స్టార్ హీరోయిన్ సమంత గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులుగా వస్తోన్న రూమర్లను నిజం చేస్తూ తాను త్వరలోనే తల్లిని కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా ‘ మా ఇంటి బంగారం ‘ సక్సెస్ మీట్ బుధవారం (జూన్ 24) హైదరాబాద్ వేదికగా జరిగింది. ఇదే కార్యక్రమంలో సమంత తాను గర్భంతో ఉన్నట్లు పేర్కొంది. కొద్దిరోజులు మెటర్నిటీ లీవ్ తీసుకుంటానని మీడియా ప్రతినిధులతో చెప్పింది. దీంతో అభిమానులు, జర్నలిస్టులు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సామ్ కూడా నవ్వుతూ థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండగా అభిమానులు, నెటిజన్లు సామ్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు.  కాగా ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్లలో ఎక్కువగా చీరలోనే కనిపించింది సమంత.  అయితే మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ మాత్రం ఆమె టీ షర్ట్, జీన్స్ లో కనిపించింది. ఈ క్రమంలోనే బేబీ బంప్ కనిపించిందని, సామ్ గర్భంతో ఉందని పెద్ద ఎత్తున ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. అయితే సామ్ కానీ, భర్త రాజ్ నిడిమోరు కానీ వీటిపై పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇదే సమయంలో  మా ఇంటి బంగారం సినిమా యూనిట్ మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. ఈ క్రమంలోనే  కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్న సమంత, రాజ్ నిడిమోరు దంపతులకు కంగ్రాట్స్ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో సామ్ ప్రెగ్నెన్సీ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఇక ఇప్పుడు తనే స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

 

ఇక మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అలాగే ఓవర్సీస్ లోనూ 2 మిలియన్ డాలర్ల ను కూడా అధిగమించనుంది.  నందిని రెడ్డి తెరకెక్కించిన  ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలోసమంతతో పాటు శ్రీనివాస గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా మా ఇంటి బంగారం సినిమాను నిర్మించారు.  సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.

వీడియో ఇదిగో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us