
శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పుట్టపర్తి వచ్చి సత్యసాయి మహా సమాధిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యారాయ్ తదితర సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. సత్యసాయి బాబాను స్మరించుకుంటూ సమాజానికి ఆయన చేసిన సేవలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు సత్యసాయిబాబాను అమితంగా ఆరాధిస్తారు. ఈ జాబితాలో ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఉంది. సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ స్టార్ హీరోయిన్ వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. అందులో ఆమె తన పేరుకు సంబంధించి ఇలా చెప్పుకొచ్చింది.
‘మా అమ్మ తాతయ్య సాయి బాబాకు భక్తులు.. మా అమ్మ, అత్తమ్మలు, మావయ్యలు సాయి బాబాకు చెందిన యూనివర్సిటీలోనే చదివారు. నన్ను చిన్నప్పటి నుంచే అక్కడికి తీసుకెళ్లే వారు. పుట్టపర్తి సాయిబాబానే నాకు పేరు పెట్టి దీవించారు. 14, 15 ఏళ్ల తరువాత నాపేరు నాకు చాలా నచ్చింది. నేను కూడా సాయిబాబా భక్తురాలినే.. సత్యసాయి బోధనలే నాలో ధైర్యాన్ని నింపాయి.. ఎలాంటి సమయంలోనైనా ప్రశాంతంగా ఉండటం, ఒత్తిడిని అధిగమించడం, క్రమశిక్షణ, ధాన్యం వంటివి ఆయన ద్వారానే నేర్చుకున్నాను’ అని సదరు హీరోయిన్ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.
Sai Pallavi at Puttaparthi for Centenary celebration of Sathya Sai Baba ❤️✨#SaiPallavi |@Sai_Pallavi92 pic.twitter.com/YdorASWmq0
— Sai PallaviFan_Boy (@PVAniruddh) November 24, 2025
కాగా ప్రస్తుతం పుట్టపర్తిలో జరుగుతోన్న సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలకు సాయి పల్లవి కూడా హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడే కాదు. గతంలోనూ పలు సార్లు సాయి బాబా ఆశ్రమంలో కనిపించిందీ న్యాచురల్ బ్యూటీ.
Sai Pallavi yesterday at Puttaparthi for Centenary celebration of Sathya Sai Baba✨#saipallavi |@Sai_Pallavi92 pic.twitter.com/V49KmCs6yk
— Sai PallaviFan_Boy (@PVAniruddh) November 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..