మాధవన్ హీరోగా నటించిన సాలా కడూస్ సినిమాతో పరిచయం అయ్యింది రితికా సింగ్. తన అందంతో పాటు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది రితికా సింగ్. ఇక ఇదే సినిమాను తెలుగులో గురు అనే టైటిల్ తో రీమేక్ చేశారు. ఈ సినిమాలోనూ హీరోయిన్ గా రితికానే నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్న సొంతం చేసుకుంది. గురూ సినిమా హిట్ అవ్వడంతో రితికా క్రేజ్ భారీగా పెరిగిపోయింది. కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. ఆతర్వాత తమిళ ఇండస్ట్రీ ఫోకస్ పెట్టింది. అక్కడ విజయ్ సేతుపతి తో కలిసి ఆండవన్ కట్టలై, అలాగే లారెన్స్ సరసన శివలింగా సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అటు మలయాళంలోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇక హీరోయిన్ గా అదరగొడుతూనే మరో వైపు స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తుంది.
రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమాలో అదిరిపోయే స్టెప్పులేసి అలరించింది. ఈ సాంగ్ చాలా వైరల్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అందాలతో కుర్రాళ్ళ మతిపోగొడుతోంది. అయితే ఈ చిన్నదాని ఫ్యామిలీ విషయాల గురించి చాలా మందికి తెలియదు.
ఇటీవలే తన తండ్రితో కలిసి ఉన్న వీడియోను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ వీడియోలో తండ్రి కూతుళ్లు ఎలా ఉన్నామన్నది ఈ భామ చెప్పకనే చెప్పింది. వీరిద్దరూ కలిసి ఉన్న ఈ రీల్ ఇన్ స్టాలో తెగ వైరల్ అయింది. ఆమె తండ్రిని చూసిన నెటిజన్లు హీరో లెక్క ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఆయనకు రితిక కూతురు అంటే నమ్మరు.. సోదరి అంటే కరెక్ట్ గా ఉంటుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రితిక తండ్రి ప్రముఖ బాక్సర్. ఆయన దగ్గరే రితిక బాక్సింగ్ నేర్చుకుంది. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది రితిక.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.