
ప్రభాస్, దర్శకుడు మారుతీ కాంబినేషన్‌లో తెరకెక్కించిన చిత్రం ‘ది రాజా సాబ్’. డిసెంబర్‌లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కొంచెం ఆలస్యంగా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి రిధి కుమార్ సినిమా గురించి పలు కీలక విషయాలను పంచుకుంది. ప్రతి నటికీ ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంటుంది. ప్రభాస్‌తో తాను ‘రాధేశ్యామ్’ సినిమా చేశానని రిధి చెప్పింది.. ఇలా తనకు అతడితో కలిసి రెండోసారి నటించే అవకాశం రావడం తన అదృష్టం అని తెలిపింది. ఇక రాధేశ్యామ్ మూవీలో తాను చేసిన ఒక సన్నివేశంలో తన నటనను ప్రభాస్ ఎంతో మెచ్చుకున్నాడని, ఆ సమయంలో ‘హూ ఈజ్ షీ, హౌ వెల్ షీ పర్ఫార్మ్డ్’ అని అన్నాడని, ఆ మాటలే తనకు ది రాజా సాబ్ అవకాశాన్ని తెచ్చిపెట్టాయని ఆమె చెప్పింది. మొదట్లో నిర్మాత ఎస్‌కెఎన్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఒక స్పామ్ కాల్ అనుకొని నమ్మలేదని, ఆ తర్వాత తన మేనేజర్ వివరించడంతోనే ఒప్పందం కుదిరిందని చెప్పుకొచ్చింది. అలా తనకు ఈ రాజాసాబ్ అవకాశం వచ్చిందంది. రాధేశ్యామ్ సినిమా షూటింగ్ సమయంలో తనకు తొలి రోజున ప్రభాస్ చీర బహుమతిగా ఇచ్చారని తెలిపింది. అది తనకి లభించిన ఒక లవ్లీ జెశ్చర్ అని పేర్కొంది. మూడు సంవత్సరాల క్రితం ఇచ్చిన ఆ చీరను తాను ఇప్పటికీ దాచుకొని, ఎంతో ప్రత్యేకంగా చూస్తానంది.
ప్రభాస్ తనపై చూపిన నమ్మకం, ఇచ్చిన సపోర్ట్ తనకు ఎంతో ముఖ్యమని రిధి కుమార్ తెలిపింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కూడా ప్రభాస్ తనను ‘బ్రిలియంట్ యాక్టర్’ అని ప్రశంసించాడని, అది తనకు ప్రపంచంతో సమానమని చెప్పింది. అలాగే బాహుబలి పార్ట్-2 తన ఫేవరెట్ తెలుగు సినిమా అని, ప్రభాస్, మారుతి తన ఫేవరెట్ హీరో, డైరెక్టర్ అని తెలిపింది. అటు ది రాజాసాబ్ విషయానికొస్తే.. సినిమా ఒక రోలర్‌కోస్టర్ రైడ్‌లా ఉంటుందని, ఇందులో హారర్, కామెడీ, రొమాన్స్, ఫన్, ఫ్రెండ్‌షిప్ లాంటి అన్ని ఎమోషన్స్ ఉంటాయని రిధి కుమార్ వెల్లడించింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..