Renu Desai: కోవిడ్ సెకండ్ వేవ్.. దేశంలో పరిస్థితి దారుణంగా మారిపోయింది. రోజుకీ లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తుండగా… హస్పిటల్స్‌లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత, ప్లాస్మా అందుబాటులో లేకపోవడం కరోనా బాధితులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కష్టకాలంలో సినీ ప్రముఖులు తమ వంతు సాయాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్.. ప్రభాస్ రాధేశ్యామ్ టీం, యంగ్ హీరో సందీప్ కిషన్, అడివి శేష్ వంటి సెలబ్రెటీలు ముందుకు రాగా.. తాజాగా కష్టాల్లో ఆదుకునేందుకు నటి రేణు దేశాయ్ ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ కష్ట సమయంలో ప్లాస్మా, బెడ్స్, ఆక్సిజన్, మందులు ఇలా ఎలాంటి అవసరం ఉన్నా తనకు మెసేజ్ చేయాలని ఆమె తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో మాట్లాడిన ఆమె ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులలో సోషల్ మీడియాలో కేవలం సినిమా ప్రమోషన్లకు మాత్రమే కాకుండా.. ఇతరులకు సహయం చేయడానికి ఉపయోగించడాన్ని ఆమె ప్రశంసించింది. తాను కూడా తనకు తోచిన సహయాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఎల్లప్పుడూ తన ఇన్ బాక్స్ ని ఓపెన్ ఉంచుతానని.. అవసరంలో ఉన్నవాళ్ళు తనకు మెసేజ్ చేయాలని రేణు దేశాయ్ కోరింది.
ఈ అవకాశాన్ని అవసరంలో ఉన్నవాళ్ళ కోసమే ఉపయోగించుకోవాలని.. అంతేకానీ.. స్పామ్, ఫార్వర్డ్ మేసేజ్‌లు పంపించవద్దని తెలిపింది. ఈ సమయంలో నిజంగా అవసరంలో ఉన్నవాళ్ళు పూర్తి వివరాలతో తనకు మెసేజ్ పంపితే తనకు వీలైనంత సహాయం అందిస్తానని తెలిపింది. ఈ క్రమంలోనే తనకు గతంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. ఆర్థికంగా సహాయంం చేయలేకపోతున్నానని తెలిపింది. కేవలం వైద్య సహాయం అందించేందుకు మాత్రమే తాను కృషి చేయగలని పేర్కొంది. కరోనా కారణంగా దిల్‌షుక్‌నగర్‌లో పరిస్థితి దారుణంగా ఉందని.. దయచేసి సహాయం చేయాలని ఓ నెటిజన్ కోరగా.. పూర్తి వివరాలు పంపిస్తే.. సహాయం అందించేందుకు ప్రయత్నిస్తాను అని ఆమె కామెంట్ చేసింది.
వీడియో..
Also Read: Kiara Advani: మరోసారి టాలీవుడ్ వైపు అడుగులేస్తున్న ముద్దుగుమ్మ.. ఆ సినిమాలో సెలక్ట్ అయ్యిందా…
Zombie Reddy: మళ్లీ భయపెట్టడానికి వస్తోన్న జాంబీలు..? కరోనా సెకండ్ వేవ్ ప్రేరణతో..