Tollywood: అయ్య బాబోయ్.. ఏంటి ఇలా అయిపోయింది.. మీరు గుర్తుపట్టారా..?

నటీమణులు కొన్నిసార్లు మేకప్ లేకుండా కనిపిస్తే గుర్తు పట్టడం చాలా కష్టం. ఈ అమ్మడిని గుర్తుపట్టారా..? ముఖంలో ఎంతో కళ ఉంటుంది. మస్త్ యాక్టింగ్ చేస్తుంది.. తెలుగులో మంచి చిత్రాల్లోనే నటించింది. తాజాగా మేకప్ లేకుండా కనిపించేసరికి నెటిజన్లు షాకవుతున్నారు.

Tollywood: అయ్య బాబోయ్.. ఏంటి ఇలా అయిపోయింది.. మీరు గుర్తుపట్టారా..?
Tollywood Heroine

Updated on: May 27, 2024 | 4:44 PM

అందం, అభినయం ఉన్నా కూడా కొంతమంది హీరోయిన్స్ లక్ కలిసిరాదు. దీంతో కొంతమంది తట్టా బుట్టా సర్దేసుకుని ఫారెన్ వెళ్లిపోవడమో, లేదా మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవ్వడమో చేస్తారు. కానీ రెజీనా కసాండ్రా ఆ టైప్ కాదు. ఆ సరైన సక్సెస్ కోసం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ తనదైన రోజు కోసం ఎదరుచూస్తూ ఉంది. ఒకప్పుడు ఈమెకు వరుస ఆఫర్లు ఉండేవి. ఓ మాదిరి హిట్లు కూడా అందుకుంది. సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్ వంటి హీరోల సరసన వరుస సినిమాలు చేసింది. కానీ అగ్ర హీరోయిన్ అన్న పేరు మాత్రం రాలేదు. దీంతో మధ్యలో గ్లామర్ డోస్ కూడా పెంచింది. అయినా పరిస్థితులు మాత్రం మారలేదు.  రెజినా తన శాకినీ డాకిని సినిమా ప్రమోషన్ టైంలో చేసిన కాంట్రవర్సీ కామెంట్లు, మీడియాతో జరిగిన వార్‌లో ఓ రేంజ్‌లో ట్రెండ్ అయింది

మగాళ్లంతా మ్యాగీ టైపు.. కేవలం రెండు నిమిషాలే అంటూ రెజినా చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. కుర్రాళ్లు ఈ హీరోయిన్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు.  తాను మాత్రం మ్యాగీ టైపు రెండు నిమిషాలు కాదంటూ.. స్టేజ్‌పై అడివి శేష్ వేసిన పంచ్‌లు కూడా రెజీనాను కొన్నాళ్లు వార్తల్లో ఉంచాయి. ఇప్పుడు రెజినాకు తెలుగులో పెద్దగా అవాకాశాలు లేవు. తమిళ్‌లో మాత్రం రెండు, మూడు సినిమాలు చేస్తోంది.  అయితే సోషల్ మీడియాలో మాత్రం మంచి యాక్టివ్ ఉంది రెజినా. హాట్ ఫోటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటోంది. ఇక తాజాగా రెజినా విత్ అవుట్ మేకప్ లుక్ మస్త వైరల్ అవుతోంది. బాస్కెట్ బాల్ ఆడుతూ.. గేమ్ కోర్టు నుంచి ఓ వీడియో తీసి తన ఇన్ స్టా స్టోరీలో పెట్టుకుంది. ఇక రెజినా ఇలా విత్ అవుట్ మేకప్‌లో కనిపించే సరికి ఫ్యాన్స్ స్టన్ అవుతున్నారు. మామూలుగా హీరోయిన్లు మేకప్ లేకుండా కనిపించేందుకు అస్సలు ఇష్టపడరు. కానీ రెజినా మాత్రం అవేం పట్టించుకోకుండా.. తన నచ్చినట్లు లైఫ్ లీడ్ చేస్తోంది. అయినా హీరోయిన్స్ అయితే మాత్రం పొద్దాక ఆ మేకప్‌లో ఉండాలా ఏంటి..? వాళ్లకంటూ స్పేస్ ఉండదా చెప్పండి…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి