‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ ప్రణీత శుభాష్ (Pranitha Subhash). ఆ తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి రభస చిత్రంలో నటించింది. వీటితో పాటు డైనమైట్, బ్రహ్మోత్సవం, హలోగురు ప్రేమకోసమే తదితర చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. ఇక కరోనా కాలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు అందుకుందీ ముద్దుగుమ్మ. ఇక సినిమా కెరీర్ ఉండగానే గతేడాది మే31న తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త నితిన్ రాజుతో రహస్యంగా పెళ్లిపీటలెక్కి అందరినీ ఆశ్చర్యపరిచిందీ ముద్దుగుమ్మ. తాజాగా ప్రణీతకు అరుదైన గౌరవం లభించింది. కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే యూఏఈ గోల్డెన్ వీసా (UAE golden visa)ను అందుకుందీ బాపుగారి బొమ్మ. ఈ విషయాన్ని ఆమే సోషల్ మీడియా (Social media) లో షేర్ చేసుకుంది. గర్వంగా ఉందంటూ పొంగిపోయింది.
కాగా క్రియేటివిటీ, పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్య సంపద తదితర రంగాల్లో అపార సేవలందిస్తున్న వారికి దుబాయ్ ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక గోల్డెన్ వీసాను అందిస్తోంది. ఈ వీసాతో ఆ దేశంలో ఎంతకాలమైనా ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా నివాసం ఉండే వీలుంటుంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇండియా నుంచి మొదటగా ఈ వీసానుఅందుకున్నాడు. ఆ తర్వాత సంజయ్ దత్, సునీల్ శెట్టి, సోనూ నిగమ్, నేహా కక్కర్, మౌనీ రాయ్, ఫరా ఖాన్, బోనీ కపూర్ కుటుంబం ఈ వీసా పొందింది. కాగా దక్షిణాదిలో మోహన్ లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, ఉపాసన, కాజల్ అగర్వాల్ ఈ వీసాను అందుకున్నారు. క్రీడా విభాగంలో సానియా మీర్జా- షోయబ్ మాలిక్ దంపతులు కూడా ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్నారు.
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. భారత్ వైఖరి వెనుక వ్యూహం ఇదేనా..?
Jharkhand: నదిలో పడవ బోల్తా.. 14 మంది గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..