
బాలీవుడ్ నటి రవీనా టాండన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది రవీనా టాండన్. హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించింది. రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్ 2’లో రమికా సేన్ పాత్రలో నటించిన రవీనా.. సౌత్ ఇండియన్ సినిమా బాలీవుడ్ కంటే చాలా బాగున్నాయని చెప్పుకొచ్చింది. ఇప్పుడు రవీనా పేరు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగానే వినిపిస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ లో రవీనా మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌లో రవీనా టాండన్ మాట్లాడుతూ.. “సౌత్ సినిమాలు మొదటి నుంచి తమ సంస్కృతి, సంప్రదాయాలను వదులుకోలేదు. సౌత్ ఇండస్ట్రీ తన మూలాలను ఎప్పుడు విడిచిపెట్టలేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం అలా కాదు. బాలీవుడ్ ఎప్పుడూ పాశ్చాత్య సంస్కృతిని కాపీ కొడుతూనే ఉంది అని సంచలన కామెంట్స్ చేసింది.అలాగే నేను సౌత్ ఇండియన్ సినిమాలో పనిచేసిన ప్రతిసారీ ఎంజాయ్ చేశాను. నేను అక్కడ పని చేసి ముంబయికి రాగానే లావు అయ్యావు, లేదా సన్నగా మారిపోయావు అనే వారు. సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లినప్పుడు నువ్వు ఎందుకు సన్నగా మారిపోయావు బాగా తిను అని చెప్పేవారు. అందుకే దక్షిణాది సినిమాలో నటిస్తున్నప్పుడు డైట్‌కి దూరంగా ఉండేదాన్ని. మంచి ఇడ్లీ, చట్నీ, దోసె తినే దాన్ని అని చెప్పుకొచ్చారు రవీనా.
రవీనా ‘కేజీఎఫ్’ గురించి మాట్లాడుతూ, ‘కేజీఎఫ్’ మొదటి భాగం షూటింగ్ జరుగుతున్నప్పుడు, నేను ఆ సినిమాలో నటించాలా వద్దా అనే గందరగోళంలో ఉన్నాను. అందుకే డూప్‌ని ఉపయోగించి షూట్ చేయమని, మొదటి భాగంలోని కొన్ని సన్నివేశాల్లో ఉపయోగించమని చెప్పాను. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత రెండో భాగంలో నటించాను’’ అని చెప్పింది రవీనా. ఈ బాలీవుడ్ బ్యూటీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మరిన్ని ఎంటర్టైమెంట్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..