
కోలీవుడ్ ఇండస్ట్రీలో రవీనా రవి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 2017లో విడుదలైన ‘ఒరు కిదైయిన్ కరుణై మను’ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత లవ్ టుడే, మామన్నన్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఆమె పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి చిత్రాలకు తన గాత్రదానం చేసింది. తెలుగులో ఓకే బంగారం, ప్రేమమ్, 2.0, నవాబ్ వంటి సినిమాల్లో నటించింది. తాజాగా రవీనా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. తనను గత మూడేళ్లుగా వేధిస్తున్న ఓ వ్యక్తి గురించి చెబుతూ భావోద్వేగ పోస్ట్ చేసింది. తనతోపాటు తన కుటుంబ సభ్యులను, సన్నిహితులను వేధిస్తున్నాడని అతడి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఇన్ స్టాలో షేర్ చేసింది.
ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..
“సాధారణ ప్రజలకు అవగాహన కోసమే ఈ పోస్ట్ చేస్తున్నాను. 3 సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్న వ్యక్తి నుండి నన్ను, నా కుటుంబాన్ని, స్నేహితులను రక్షించుకోవడానికి నేను ఈ పోస్ట్‌ను పోస్ట్ చేస్తున్నాను. పోలీసులకు ఫిర్యాదు, హెచ్చరిక దాఖలు చేయడం వల్ల ఇది ఆగిపోతుందని భావించి నేను మౌనంగా ఉన్నాను. కానీ, సబరీష్ అనే వ్యక్తి, అతని ఇద్దరు సోదరులు నన్ను, నా కుటుంబాన్ని, నా స్నేహితులను నిరంతరం వేధిస్తున్నారు. సందేశాలు, కామెంట్లతో నన్ను మాత్రమే కాకుండా నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులను కూడా అసభ్యకరమైన పదాలతో దూషిస్తున్నారు. దీనివల్ల నా కుటుంబం, స్నేహితులు చాలా ప్రభావితమవుతున్నారు. నేను వారికి క్షమాపణలు కోరుతున్నాను. మేము చట్టపరమైన చర్యలు తీసుకున్నాము. కానీ వారు ఆగలేదు. వారు వివిధ ఖాతాలను ఉపయోగించి నన్ను వేధించడమే కాకుండా, వారు ఇప్పటికే పరిచయం ఉన్నవారనీ, నాతో ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని చెబుతున్నారు. అలాగే కొందరు నటీమణులను కూడా వేధిస్తున్నారు.” అంటూ రాసుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..
ప్రజలలో ఎవరికైనా ఇలా జరిగితే, ముందుగా వారి ప్రొఫైల్‌ను బ్లాక్ చేయండి. వారి కామెంట్స్ కు రియాక్ట్ కాకండి. భారతదేశంలో మహిళలకు చెన్నై అత్యంత సురక్షితమైన నగరం అని చెబుతారు. సంబంధిత అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు రవీనా. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.