స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతోంది. తక్కువ సమయంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ రాణిస్తోంది రష్మిక.. స్టార్ హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియెంటడ్ సినిమాలతో ఆకట్టుకుంటోంది రష్మిక. ఇదిలా యూత్ తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె సోషల్ మీడియా పోస్ట్ చూసి అభిమాను షాక్ అవుతున్నారు. రష్మిక మందన తన ప్రమాదం జరిగిందని తెలిపింది. దాంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. తనకు ఏమైంది.? ఎప్పుడు జరిగింది .? అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.
గత నెలలో నాకు చిన్న ప్రమాదం జరిగింది. డాక్టర్ సలహా మేరకు ఇంట్లోనే ఉండి కోలుకున్నాను. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను’ అని రష్మిక మందన్న తన అభిమానులతో పంచుకున్నారు. నెలరోజులుగా నేను యాక్టివ్గా లేను. ఓ చిన్న ప్రమాదం జరగడమే అందుకు కారణం. వైద్యుల సూచన మేరకు ఇంటివద్దే ఉంటున్నా. త్వరలోనే మళ్లీ షూటింగ్స్ కు హాజరవుతా.. జీవితం చాలా విలువైనది. జాగ్రత్తగా ఉండండి. రేపనేది ఉంటుందో లేదో తెలీదు. హ్యాపీగా జీవించండి’ అని పోస్ట్ పెట్టిన రష్మిక మందన్నా.
ప్రమాదం జరిగినప్పటికీ, రష్మిక కోలుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే రష్మిక మందన్న చాలా సినిమాల్లో బిజీగా ఉంది. ఈ బ్యూటీ ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న’పుష్ప 2′ షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘సికందర్’ దానితోపాటు ‘చావా’ సినిమాల్లో నటిస్తుంది. అలాగే తమిళ్ లోనూ కొన్ని సినిమాలను లైనప్ చేసింది ఈ అమ్మడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.