Rambha : ఆ హీరో అంటే ఇప్పటికీ కోపమే.. ఎక్కడ కనబడినా తిడతాను.. హీరోయిన్ రంభ..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లలో రంభ ఒకరు. 15 ఏళ్లకే కథానాయికగా తెరంగేట్రం చేసిన ఆమె.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. వెంకటేశ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించి తనదైన ముద్ర వేసింది. అలాగే అప్పట్లో స్పెషల్ పాటలతో ఊర్రుతలూగించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది.

Rambha : ఆ హీరో అంటే ఇప్పటికీ కోపమే.. ఎక్కడ కనబడినా తిడతాను.. హీరోయిన్ రంభ..
Rambha

Updated on: Jun 15, 2026 | 8:54 PM

నైంటీస్ (90s) టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రంభ, అప్పట్లో తన గ్లామర్, నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. తెలుగులో స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో రంభ పాల్గొని, తన సినీ కెరీర్ విశేషాలతో పాటు విలక్షణ నటుడు జేడీ చక్రవర్తితో తనకు ఉన్న స్నేహం, ఆ తర్వాత వచ్చిన విభేదాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రంభ, జేడీ చక్రవర్తి కాంబినేషన్‌లో వచ్చిన ‘బొంబాయి ప్రియుడు’ (1996) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో జేడీ చక్రవర్తి తనకు అత్యంత ఆప్తుడైన స్నేహితుడిగా మారాడని రంభ గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : ఏం పాట రా బాబు.. అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. ఇప్పటికీ ట్రెండింగ్ ఈ సాంగ్..

జేడీ చక్రవర్తి ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, అందరికీ మంచి జరగాలని కోరుకునే మనస్తత్వం ఆయనదని అన్నారు. అయితే ఆయనలో చాలా నాటకీయత (నాటకబాజీ) ఉంటుందని, ఆడవాళ్ల కంటే ఎక్కువగా ఆయనే డ్రామాలు చేయగలరంటూ సరదాగా నవ్వేశారు. ఇంతటి గాఢమైన స్నేహం ఉన్నప్పటికీ, ప్రస్తుతం తామిద్దరం మాట్లాడుకోవడం లేదని రంభ వెల్లడించారు. జేడీ చక్రవర్తిపై తనకు ఇప్పటికీ చాలా కోపం ఉందని ఆమె స్పష్టం చేశారు. దానికి గల కారణాన్ని వివరిస్తూ.. తన జీవితంలో అత్యంత కీలకమైన వివాహ వేడుకకు జేడీ చక్రవర్తి హాజరుకాకపోవడమేనని చెప్పారు. అంతటి ప్రాణ స్నేహితుడు తన పెళ్లిని స్కిప్ చేయడం తనకు తీవ్ర నిరాశను మిగిల్చిందని, ఆ కోపంతోనే ఆయనతో పరిచయాన్ని కట్ చేసుకున్నానని తెలిపారు. తనను కలిస్తే ఎక్కడ తిడతానో అనే భయంతోనే జేడీ కూడా ఇప్పుడు తనకు ముఖం చాటేస్తున్నారని రంభ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్..

ఇదే ఇంటర్వ్యూలో రంభ తన గ్లామర్ పాత్రల ఎంపికపై కూడా స్పందించారు. మలయాళంలో తను నటించిన అవార్డు విన్నింగ్ చిత్రం ‘సర్గం’ తెలుగులో ‘సరిగమలు’గా రీమేక్ అయినప్పుడు ఆశించిన విజయం సాధించలేదని, అయినప్పటికీ తను ఎప్పుడూ బాధపడలేదన్నారు. కమర్షియల్ సినిమాలు, గ్లామరస్ కాస్ట్యూమ్స్ , డ్యాన్సులు చేయడం అంటేనే తనకు ఎంతో ఇష్టమని, టాలీవుడ్ ప్రేక్షకులు తనను ఆ పాత్రల్లోనే ఎక్కువగా ప్రేమించారని రంభ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..

ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్..

Follow Us